Kriti Sanan Prabhas : అదంతా ప్ర‌చారం పెళ్లి అబ‌ద్దం

స్ప‌ష్టం చేసిన న‌టి కృతి స‌న‌న్

Kriti Sanan Prabhas : గ‌త కొంత కాలంగా కృతీ స‌న‌న్ , న‌టుడు ప్ర‌భాస్ ఇద్ద‌రూ పీక‌ల లోతు ప్రేమ‌లో కూరుకు పోయార‌ని త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ఇక సోష‌ల్ మీడియాలో ఇద్ద‌రి ప్రేమాయణం గురించి చ‌ర్చ‌లు కొన‌సాగాయి. ఇదిలా ఉండ‌గా ప్ర‌భాస్, కృతి స‌న‌న్ క‌లిసి ఆది పురుష్ లో న‌టిస్తున్నారు.

ఇద్ద‌రూ డేటింగ్ లో ఉన్నార‌ని త్వ‌ర‌లో పెళ్లి పీట‌లు ఎక్క‌నున్నార‌ని కోడై కూసింది మీడియా. దీంతో ఇద్ద‌రి వ్య‌వ‌హారంపై సీరియ‌స్ గా స్పందించింది కృతీ స‌న‌న్. ఈ వ్య‌వ‌హారానికి..ప్ర‌చారానికి చెక్ పెట్టింది ముద్దుగుమ్మ‌. తామిద్ద‌రి మ‌ధ్య అలాంటిది ఏమీ లేద‌ని, క‌నీసం ప్రేమ కూడా ఉండేందుకు ఆస్కారం లేద‌ని పేర్కొంది.

ఇదంతా తమ‌ను బ్లేమ్ చేయ‌డానికి చేసిన కుట్ర‌గా అభివ‌ర్ణించింది ఈ బొమ్మ‌. అయితే బాలీవుడ్ హీరో వ‌రుణ్ ధావ‌న్ అయితే ఏకంగా ఆర‌డ‌గుల అంద‌గాడు ప్ర‌భాస్, ల‌వ్లీ హీరోయిన్ కృతీ స‌న‌న్(Kriti Sanan Prabhas) డేటింగ్ లో ఉన్నారంటూ పేర్కొన్నాడు. దీంతో బ‌య‌ట జ‌రుగుతున్న ప్ర‌చారానికి వ‌రుణ్ ధావ‌న్ చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత తోడ‌య్యాయి.

కృతీ స‌న‌న్ త‌న ఇన్ స్టా గ్రామ్ లో కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఇదంతా అబ‌ద్ద‌మ‌ని, స‌త్య దూర‌మ‌ని, తామిద్ద‌రం డేటింగ్ లో లేమ‌ని పేర్కొంది. ఆపై తామిద్ద‌రిని ఆట ప‌ట్టించేందుకు వ‌రుణ్ ధావ‌న్ అలా కామెంట్ చేశాడంటూ చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పింది కృతీ స‌న‌న్.

మ‌రో వైపు స‌న‌న్ సీత‌గా ప్ర‌భాస్ రాముడిగా ఆది పురుష్ లో న‌టిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. తామిద్ద‌రం మంచి స్నేహితుల‌మ‌ని స్ప‌స్టం చేసింది.

Also Read : ఈడీ విచార‌ణ‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ

Leave A Reply

Your Email Id will not be published!