BCCI Rishabh Pant : బీసీసీఐ నిర్వాకం పంత్ కు అంద‌లం

విఫ‌ల‌మైనా ఎంపిక‌..శాంస‌న్ పై వివ‌క్ష

BCCI Rishabh Pant : గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ట్రోల్ కు గుర‌వుతోంది. సోష‌ల్ మీడియాలో ప్ర‌ధానంగా ట్విట్ట‌ర్ లో ట్రెండింగ్ లో ఉంది. బీసీసీఐతో పాటు రిష‌బ్ పంత్(BCCI Rishabh Pant), సంజూ శాంస‌న్ పేర్లు మారుమ్రోగుతున్నాయి. ఎవ‌రైనా ప్ర‌తిభ క‌లిగిన వారిని జ‌ట్టులోకి ఎంపిక చేస్తారు.

కానీ అద్భుతంగా రాణించినా కేర‌ళ స్టార్ సంజూ శాంస‌న్ ను కావాల‌ని ప‌క్క‌న పెట్ట‌డంపై నిప్పులు చెరుగుతున్నారు. అటు అభిమానుల‌తో పాటు ఇటు మాజీ క్రికెట‌ర్లు సైతం బీసీసీఐని, కోచ్ అనుస‌రిస్తున్న తీరుపై మండిప‌డుతున్నారు. రిష‌బ్ పంత్ కంటే సంజూ శాంస‌న్ అత్యంత ప్ర‌తిభావంతుడ‌ని పేర్కొంటున్నారు.

న్యూజిలాండ్ సీరీస్ లో భాగంగా జ‌రిగిన మూడో వన్డేకు ముందు కోచ్ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ ఇచ్చిన స‌మాధానం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. న‌వంబ‌ర్ 4లో పంత్ బాగా ఆడ‌తాడ‌ని అందుకే ఎంపిక చేశామ‌న్నాడు. విచిత్రం ఏమిటంటే 11 ఇన్నింగ్స్ లు రిష‌బ్ పంత్ ఆడితే అందులో 10 ఇన్నింగ్స్ ల‌లో ఘోరంగా వైఫ‌ల్యం చెందాడు.

పంత్ వెనుక బ‌ల‌మైన రాజ‌కీయ శ‌క్తి ఉంద‌ని, మ‌నీతో పాటు పాలిటిక్స్ కూడా బీసీసీఐలో ఎక్కువ ప్రాధాన్య‌త సంత‌రించు కుంటాయ‌ని మ‌రికొంద‌రు ట్విట్ట‌ర్ వేదికగా నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా జ‌రిగిన మూడో వ‌న్డేలో సైతం రిష‌బ్ పంత్ ఫెయిల్ అయ్యాడు. కేవ‌లం 10 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు..నిరాశ ప‌రిచాడు. రి

టైర్ అయ్యేంత వ‌ర‌కు జ‌ట్టులో పంత్ ఉంటాడ‌ని మ‌రికొంద‌రు సెటైర్లు వేస్తున్నారు. ఇదిలా ఉండగా బీసీసీఐ చీఫ్ రోజ‌ర్ బిన్నీ, కార్య‌ద‌ర్శి జే షా, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లాపై ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. ఇక రాజ‌కీయాలు వ‌దిలేసి ప్ర‌తిభ క‌లిగిన ఆట‌గాళ్లకు చాన్స్ ఇవ్వాల‌ని కోరుతున్నారు.

Also Read : మ్యాచ్ వ‌ర్షార్ఫ‌ణం సీరీస్ కీవీస్ కైవ‌సం

Leave A Reply

Your Email Id will not be published!