Mukesh Ambani : మాతాజీ పితాజీ 5జీ కంటే ఎక్కువ – అంబానీ
తల్లిదండ్రులు లేక పోతే మేం లేం
Mukesh Ambani : ప్రముఖ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ గ్రూప్ సంస్థల చైర్మన్ ముఖేష్ అంబానీ(Mukesh Ambani) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెక్నాలజీ మరింత సులువుగా మారింది. ఇవాళ ప్రపంచం చాలా చిన్నదిగా అనిపిస్తోంది. 5జీ రాకతో కొత్త ప్రపంచాన్ని ఈ తరం చూస్తోందన్నారు. కానీ 5జీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
5జీ కంటే మాతాజీ పితాజీ ఎక్కువ అని స్పష్టం చేశారు. జీవితంలో ఉన్నంతగా ఎదగడానికి తల్లిదండ్రులు ఎంతగానో తోడ్పడతారని వారిని మరిచి పోకూడదన్నారు. అందుకే ఆయన తన పేరెంట్స్ గురించి గొప్పగా చెప్పారు. ఆపై వారికి తాము ఎళ్లప్పటికీ రుణపడి ఉంటామన్నారు ముఖేష్ అంబానీ.
పండిట్ దీన్ దయాళ్ ఎనర్జీ యూనివర్శిటీ స్నాతకోత్సవం సందర్భంగా ఆయన పాల్గొని ప్రసంగించారు. గ్రాడ్యూయేట్ చేస్తున్న విద్యార్థులతో ముఖేష్ అంబానీ సంభాషించారు. మీరు ఏ స్థానంలో ఉన్నా ఎంత ఎత్తుకు ఎదిగినా పేరెంట్స్ ఉన్నారన్న విషయం మరిచి పోకూడదన్నారు.
అంతే కాదు మన ఉన్నతికి వారే కారణమని , వారి మూలాలను గుర్తు పెట్టుకోవాలని సూచించారు. పేరెంట్స్ ఉండడం అంటే మనం అదృష్టవంతులమని గమనించాలని పేర్కొన్నారు దిగ్గజ కుబేరుడు(Mukesh Ambani) . ఇవాళ ప్రతి యువత 4జీ లేదా 5జీ గురించి మాట్లాడుకుంటున్నారు.
కానీ ఆ జీల కంటే మాతాజీ, పితాజీ చాలా గొప్ప వాళ్లు అని తెలుసు కోవాలన్నారు ముఖేష్ అంబానీ. మీరు చదువుకుని పైకి ఎదగాలని, ఉన్నత స్థానాలలో నిలవాలని ప్రతి పిల్లలను కన్న తల్లిదండ్రులు కోరుకుంటారని అన్నారు. దీనిని గమనించి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Also Read : ట్విట్టర్ లో హానికరమైన కంటెంట్ కు చెక్