Mathew Wade : మాథ్యూ వేడ్ నిర్వాకంపై ఆగ్ర‌హం

హెచ్చ‌రించిన ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండ‌క్ట్

Mathew Wade : ఆర్సీబీతో జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో గుజ‌రాత్ టైటాన్స్ ఆట‌గాడు మాథ్యూ వేడ్ ప్ర‌వ‌ర్తించిన తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. ప్ర‌స్తుతం వేడ్ చ‌ర్చ‌నీయాంశంగా మారాడు.

లెగ్ బిఫోర్ వికెట్ గా వెనుదిరిగాడు. తాను ఔట్ కాలేదంటూ థ‌ర్డ్ అంపైర్ ను రెఫ‌ర్ కోరాడు. కానీ మాథ్యూ వేడ్(Mathew Wade) కు వ్య‌తిరేకంగా నిర్ణ‌యం వ‌చ్చింది. థ‌ర్డ్ అంపైర్ కూడా వేడ్ అవుట్ అంటూ ప్ర‌క‌టించాడు.

కానీ నిరాశ‌గా పెవిలియ‌న్ కు వెళ్లాడు. అక్క‌డే వేడ్ అదుపు త‌ప్పాడు. డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి నానా హంగామా సృష్టించాడు. బ్యాట్ , ప్యాడ్స్ ను నేల‌కేసి కొట్టాడు. హెల్మెట్ విసిరేశాడు.

ఇదే స‌మ‌యంలో వేడ్ ఆగ్ర‌హానికి ఇంకో ఆట‌గాడు ఉండి ఉంటే ఇబ్బంది ప‌డేవారు. బ్యాట్ ను ప‌లుసార్లు నేల‌కేసి కొట్ట‌డం చ‌ర్చ‌కు దారితీసింది.

ఈ మొత్తం వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు దారి తీయ‌డంతో రంగంలోకి దిగింది ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ మేనేజ్ మెంట్ దిగింది. మాథ్యూ వేడ్(Mathew Wade) అనుస‌రించిన వ్య‌వ‌హారంపై సీరియ‌స్ అయ్యింది.

డ్రెస్సింగ్ రూమ్ లో బ్యాట్ ను, హెల్మెట్ ను విసిరేయ‌డం అనేది వేడ్ ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండ‌క్ట్ లెవల్ -1 రూల్ ను ఉల్లంఘించాడ‌ని గుర్తించింది.

కాగా త‌నంత‌కు తానుగా కోపాన్ని ప్ర‌ద‌ర్శించాడే త‌ప్పా వేరే వారిపై ప్ర‌ద‌ర్శించ లేక పోవ‌డంతో వేడ్ బ‌తికి పోయాడు. లేక పోతే నిషేధం ఎదుర్కొని ఉండేవాడు. దీనిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని మొద‌టిసారిగా క్ష‌మించి వ‌దిలి వేస్తున్న‌ట్లు ఐపీఎల్ మేనేజ్ మెంట్ వెల్ల‌డించింది.

Also Read : తెలంగాణ బిడ్డ బాక్సింగ్ లో జ‌గ‌జ్జేత

Leave A Reply

Your Email Id will not be published!