MCC Announces : ఆస్ట్రేలియా లోని మెల్ బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ)(MCC Announces) కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు భారత క్రికెట్ కు చెందిన పలువురు క్రికెటర్లకు తీపికబురు చెప్పింది. మాజీ క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్ , మిథాలీ రాజ్ లకు ఎంసీసీ జీవిత కాల సభ్యత్వాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది.
ఈ మేరకు కీలక ప్రకటన చేసింది . క్రికెట్ పరంగా దేశానికి, ఆటకు అందించిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవాన్ని అందజేస్తున్నట్లు వెల్లడించింది. ఇండియాకు చెందిన ఆటగాళ్లతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విశిష్ట సేవలు అందించిన ఆటగాళ్ల జాబితాను కూడా ప్రకటించింది ఎంసీసీ.
ఇప్పటి వరకు సచిన్ , జెన్నీ గన్ , లారా మార్ష్ , ఇయాన్ మోర్గాన్ , పీటర్సన్ , సోల్ , మహ్మద్ హఫీజ్ , రేచల్ హేల్స్ , మోర్తజా , రాస్ టేలర్ , డేల్ స్టెయిన్ లకు ఎంసీసీ జీవిత కాల సభ్యత్వాన్ని ఇచ్చింది. ఇదిలా ఉండగా జార్ఖండ్ డైనమెంట్ ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత్ పలు కప్ లను , టైటిళ్లను గెలుచుకుంది.
ఇక యువరాజ్ సింగ్ ఇండియా విజయాల్లో ముఖ్య భూమిక పోషించాడు. ఇక హైదరాబాద్ స్టార్ మిథాలీ రాజ్ అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా చరిత్ర సృష్టించింది. అత్యధిక మ్యాచ్ లకు స్కిప్పర్ గా కూడా ఉన్నారు.
Also Read : అందరి కళ్లు పాప్ సింగర్ పైనే