McDonald Offices Close : మెక్ డొనాల్డ్స్ ఆఫీసులు క్లోజ్
ఆర్థిక మాంద్యం దెబ్బకు విలవిల
McDonald Offices Close : ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న ఆర్థిక మాంద్యం తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రతి రంగంపై దీని ప్రభావం పడుతోంది. దీని కారణంగా అన్ని రంగాలకు చెందిన కంపెనీలు, సంస్థలన్నీ ఉద్యోగులను తీసి వేసే పనిలో పడ్డాయి. ఇప్పటికే ఐటీ , లాజిస్టిక్, ఫార్మా, మీడియా సంస్థలన్నీ కొలువులకు మంగళం పాడుతున్నాయి. మరో వైపు ప్రపంచ ఆర్థిక రంగాన్ని శాసిస్తూ వస్తున్న అమెరికా సైతం ఇప్పుడు తీవ్ర సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది. పేరొందిన బ్యాంకులు రెండు దివాళా తీయడంతో వాటిని మూసి వేయక తప్పలేదు.
తాజాగా కోలుకోలేని షాక్ కు గురి చేసింది ప్రముఖ అమెరికాకు చెందిన ఫాస్ట్ ఫుడ్ డెలివరీ సంస్థ మెక్ డొనాల్డ్స్(McDonald Offices Close) . అమెరికా లోని తమ ఆఫీసులన్నింటిని తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు ప్రకటించింది. అంతే కాకుండా తమ సంస్థలో పని చేస్తున్న వారంతా వర్క్ ఫ్రమ్ హోం సౌకర్యాన్ని కల్పించినున్నట్లు వెల్లడించింది.
అంతే కాకుండా త్వరలోనే ఉద్యోగులను కూడా తొలగించనున్నట్లు తెలిపింది మెక్ డొనాల్డ్స్(McDonald) కంపెనీ. ఏప్రిల్ 5 నాటికి ఎంత మందిని తొలగించనుందనే విషయంపై సంస్థ నుంచి ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంటూ తెలిపింది అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్.
ప్రపంచ ఆర్థిక మాంద్యం దెబ్బకు ఫేస్ బుక్ మెటా, గూగుల్, మైక్రో సాఫ్ట్ , అమెజాన్ , తదితర దిగ్గజ సంస్థలు 80 వేల మందికి పైగా ఉద్యోగులపై వేటు వేసింది. కంపెనీ ప్రకటనతో వేలాది మంది ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
Also Read : మెక్‌డొనాల్డ్స్ US కార్యాలయాలకు తాళం.. లేఆఫ్ నోటీసులు