Unni Mukundan Modi : మోదీతో భేటీ అద్భుతం – ముకుందన్
మలయాళ నటుడి ట్వీట్ వైరల్
Unni Mukundan Modi : కేరళలో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆకాశానికి ఎత్తేశాడు ప్రముఖ మలయాళ నటుడు ఉన్నీ ముకుందన్. టూర్ సందర్భంగా పీఎంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు నటుడు(Unni Mukundan Modi).
మోదీతో పంచుకున్న క్షణాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాను మోదీని కలుస్తానని అనుకోలేదని, కానీ ప్రధానమంత్రితో 45 నిమిషాల పాటు మాట్లాడటం తన జీవితంలో మరిచి పోలేనని పేర్కొన్నాడు ఉన్నీ ముకుందన్. నరేంద్ర మోదీ ఉత్సాహం, పట్టుదల, ఆయనకు తెలుసు కోవాలన్న ఆసక్తి తనను ఎంతగానో ప్రభావితం చేసిందని తెలిపాడు ముకుందన్.
తాను చిన్నప్పటి నుండి ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీని కలవాలని అనుకున్నానని కానీ కలవలేక పోయానని తెలిపాడు. ప్రస్తుతం ఈ ఏడాదలో మోదీ కేరళకు రావడం, తాను కలుసు కోవడం కలగా ఉందన్నాడు. మోదీతో సమావేశం తనను మరింత ఆనందానికి, సంతోషానికి లోను చేసిందని తెలిపాడు ఉన్నీ ముకుందన్.
తాను 14 ఏళ్లప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నానని తెలిపాడు. యువం కార్యక్రమంలో వేదికపై ప్రధాని మోదీ(PM Modi) గుజరాతీ భాషలో కేమ్ చో బైలా అని పలకరించారని , తాను ఇంకా మరిచి పోలేక పోతున్నానని పేర్కొన్నాడు మలయాళ నటుడు ఉన్నీ ముకుందన్.
Also Read : మన్ కీ బాత్ లో రవీనా..అమీర్ ఖాన్