Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సంచలన కామెంట్స్ చేశారు. కంటెంట్ లో దమ్ముంటే ఎలాంటి సినిమా అయినా ఆడుతుందన్నారు. తరాలు మారినా కొత్త హీరోలు ఎంట్రీ ఇచ్చినా వయస్సు మీద పడినా తనకు ఎదురే లేదని స్పీడ్ లో ఉన్నారు చిరంజీవి.
డిఫరెంట్ కథలను ఎంచుకుంటున్నారు. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే ఓకే చెబుతున్నారు. తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన సోషియో ఫాంటసీ మూవీ బింబిసార, చిరు సీతారామం సక్సెస్ టాక్ తో దూసుకు పోతున్నాయి.
ప్రేక్షకులు కేవలం ఓటీటీకే పరిమితం అవుతారన్న దానిని పక్కన పెట్టి ఆదరించారు. ఇటీవల పుష్ప, సర్కారు వారి పాట, ఎఫ్3 మూవీలు కూడా అంచనాలకు మించి విజయాన్ని సాధించాయి.
ఇక చిరంజీవి ఎల్లప్పుడూ ఇతర సినిమాలు బాగుంటే వెంటనే స్పందించడం, వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియ చేయడం చేస్తారు.
శనివారం ట్విట్టర్ వేదికగా ఆయా సినిమాల నిర్మాతలు, దర్శకులు, యూనిట్ లోని సభ్యులందరినీ ప్రశంసలతో ముంచెత్తారు. మంచి సినిమాలు తీసినందుకు కంగ్రాట్స్ తెలిపారు.
కంటెంట్ బావుంటే సినిమాలను ప్రేక్షకులు హత్తుకుంటారని, ఆదరిస్తారన్న నమ్మకం ఈ సినిమాల ద్వారా మరోసారి ప్రూవ్ అయ్యిందన్నారు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) .
కాగా ప్రస్తుతం చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల తెలుగు సినిమా రంగం కొత్త వారికి ఎక్కువగా చాన్స్ ఇస్తోంది.
గతంలో హీరోలకు అనుగుణంగా కథలు ఉండేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. కంటెంట్ కు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు.
Also Read : నెట్టింట్లో లైగర్ ఆఫత్ సాంగ్ వైరల్