Chiranjeevi Oscar Award : భారత దేశానికి దక్కిన గౌరవం
విశ్వ వేదికపై తెలుగు వాడి సత్తా
Chiranjeevi Oscar Award : దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు దక్కింది. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ 2023 పురస్కారం లభించింది.
సోమవారం అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో నాటు నాటు పాటకు పురస్కారం దక్కింది. ఆస్కార్ అవార్డు దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi Oscar Award). ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆర్ఆర్ఆర్ టీంను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. యావత్ భారత దేశానికి దక్కిన గౌరవంగా పేర్కొన్నారు. ఎంతో కష్టపడ్డారు. తన తనయుడు రామ్ చరణ్ కూడా భాగం కావడం సంతోషానికి గురి చేసిందన్నారు. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, నటులు ఆలియా భట్ , జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ , పాట రాసిన చంద్రబోస్ , సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి , పాడిన రాహుల్ సిప్లిగంజ్ , కాల భైరవలను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు.
తన ఇన్నేళ్ల కెరీర్ లో తెలుగు సినిమాకు దక్కిన గుర్తింపు రాజమౌళి వల్ల వచ్చిందన్నారు. ప్రతి ఒక్కరికీ పండగ వాతావరణం నెలకొందన్నారు. ఈ మొత్తం క్రెడిట్ మాత్రం జక్కన్నకు మాత్రమే దక్కుతుందన్నారు చిరంజీవి. ధైర్యం, పట్టుదలతోనే ఇది సాధ్యమైందన్నారు.
ఇవాళ కోట్లాది మంది భారతీయుల హృదయాలు గర్వంతో ఉప్పొంగి పోతున్నాయని పేర్కొన్నారు మెగాస్టార్. ఇదిలా ఉండగా ఈ పాటను చంద్రబోస్ రాశారు. దాదాపు నెల రోజుల పాటు తీసుకున్నారు. ఈ పాటను ఉక్రెయిన్ లో చిత్రీకరించారు. రూ. 20 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం.
Also Read : జయహో చంద్రబోస్..కీరవాణి