మెప్మా భాగ‌స్వామ్య సంస్థ‌ల మ‌ధ్య అవ‌గాహ‌న ఒప్పందం

మ‌హిళ‌ల‌ను ల‌క్ష‌లాదికారుల‌ను త‌యారు చేయ‌డం ల‌క్ష్యం

అమ‌రావతి : మెప్మా భాగ‌స్వామ్య సంస్థ‌ల మ‌ధ్య అవ‌గాహ‌న ఒప్పందం జ‌రిగింది. ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త అమరావతిలోని ఏపీసీఆర్డీఏలో వ్యాపార భాగస్వాముల సదస్సు అవగాహన ఒప్పందాల మార్పిడి జ‌రిగింది . ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త కార్యక్రమంలో భాగంగా, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా), పురపాలక పరిపాలన , పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈరోజు అమరావతిలోని ఏపీసీఆర్డీఏ కార్యాలయంలో వ్యాపార భాగస్వాముల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూర నారాయణ‌ అధ్యక్షత వహించారు.

ఈ సదస్సులో ప్రముఖ 12 బ్రాండ్లు , ఫ్రాంచైజీ భాగస్వామ్య సంస్థలు స్వయం సహాయక సంఘాల మహిళా పారిశ్రామికవేత్తల కోసం తమ వ్యాపార నమూనాలను ప్రదర్శించాయి. అనంతరం మెప్మా మిషన్ డైరెక్టర్ మరియు క్రింది భాగస్వామ్య సంస్థల మధ్య అవగాహన ఒప్పందాలు మార్పిడి జరిగాయి. వీటిలో ఎంబ్రాయిడరీ – ఎంబ్రాయిడరీ , బుటిక్, బ్యూటిత్వ – బ్యూటీ అండ్ వెల్‌నెస్, మిస్ బర్గర్ – ఆహారం ,పానీయాలు, నేచురిక్స్ – ఐస్‌క్రీమ్స్, టీ టైమ్ – ఆహారం, పానీయాలు, మోమో నెస్ట్ – ఆహారం అండ్ పానీయాలు, చాయ్ రాస్తా ఆహారం, పానీయాలు, రీచ్ మై స్టోర్ – రిటైల్ , కన్వీనియన్స్ స్టోర్ , తృప్తి క్యాంటీన్ – ఆహారం , పానీయాలు, 9 నట్జ్ – చిరుధాన్య ఉత్పత్తులు, నేటివ్ అరకు కాఫీ – ఆహారం , పానీయాలు, ఈబీజీ గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్ (గోమిల్ బ్రాండ్ ప్రమోటర్లు) – ఆహారం ,చిరుధాన్య ఉత్పత్తులు

వీటిలో గోమిల్ (ఈబీజీ గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోట్ చేస్తున్న బ్రాండ్) , బ్యూటిత్వ సంస్థలను “స్వయం-ఏపీ (SWAYAM-AP) బ్రాండ్ కింద ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నారు . ఈ భాగస్వామ్యాలు ఎంబ్రాయిడరీ, బ్యూటీ , వెల్‌నెస్, ఆహారం , పానీయాలు, ఐస్‌క్రీమ్స్, రిటైల్ , చిరుధాన్య ఉత్పత్తులు వంటి విభిన్న రంగాలను కలిగి ఉన్నాయి. గృహ ఆధారిత యూనిట్లు, కియోస్క్‌లు, కంటైనర్ యూనిట్లు, బుటిక్ నమూనాల రూపంలో రూ.2 లక్షల నుండి రూ.20 లక్షల వరకు పెట్టుబడితో ఈ ఫ్రాంచైజీ అవకాశాలు అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని స్వయం సహాయక సంఘాల (SHG) కుటుంబాలు ఈ ఫ్రాంచైజీ యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు ముద్ర (MUDRA), CGTMSE పథకాల ద్వారా రుణ అనుసంధానం, బ్యాంకుల భాగస్వామ్యం, వ్యవస్థాపక శిక్షణ, సాంకేతిక మార్గదర్శకత్వం , మెప్మా ద్వారా సంపూర్ణ సహాయ సహకారాలు అందించబడతాయి.

Leave A Reply

Your Email Id will not be published!