Messi Success Comment : సక్సెస్ ఇచ్చే కిక్కే వేరప్పా
మెస్సీ మామూలోడు కాదప్పా
Messi Success Comment : ఒక్కసారి విజయం అన్నది దరి చేరితే దాని కిక్కు వేరే లేవల్ లో ఉంటుంది. మార్మిక, యాంత్రిక, సాంకేతికత డామినేట్ చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఎక్కడ చూసినా గణనీయంగా పోటీ నెలకొంది. శ్వాసించడం దగ్గర నుంచి మరణించేంత దాకా ప్రతి నిమిషం పోటీనే.
ఈ పోటీ ఆటల్లో ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా పరుగు పందెం, టెన్నిస్, ఫుట్ బాల్ , క్రికెట్ లలో ఉత్కంఠ భరిత క్షణాలకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అందుకే వీటి పట్ల కోట్లాది మంది పెద్ద ఎత్తున ఆకర్షితులవుతారు. ఉద్విగ్నతకు లోనవుతారు. ఆట ఆరంభం నుంచి ముగింపు వచ్చేంత వరకు నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగుతుంది.
విశ్వ విజేతగా నిలవాలంటే ఎంత దమ్ముండాలి. ఎంత తెగువ ఉండాలి. అందుకే ఎందరో ఆటగాళ్లు ఉన్నా కొందరే హీరోలుగా మిగిలి పోతారు. కారణం వాళ్లు భిన్నంగా ఉండటమే. ప్రతి విజయం వెనుక ఓ కథ ఉంటుంది. దాని వెనుక అంతులేని శ్రమ దాగి ఉంటుంది. అన్నింటిని దాటుకుని రావాలంటే చాలా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది.
అలాంటి విజేత కథే లియోనెల్ మెస్సీది. ఇవాళ యావత్ ప్రపంచం అతడి వైపు చూస్తోంది. వెదుకుతోంది. తెలుసు కోవాలని ప్రయత్నం చేస్తోంది. విజేతలు ఎలా ఉంటారు. ఏం చేస్తారు. వారికే ఎందుకు సక్సెస్ దక్కుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కానీ ప్రపంచాన్ని జయించిన వాళ్లు, ప్రభావితం చేసే వాళ్లు, గెలుపు అంచుల మీద నిలబడిన వాళ్లు, జెండా ఎగరేసిన వాళ్లంతా ఎక్కడి నుంచో ఊడి పడలేదు.
వాళ్లు మనలాంటి సామాన్యులే. కానీ భిన్నంగా ఆలోచించారు. మనకంటే బాగా కష్టపడ్డారు. లక్ష్యాన్ని ముందు పెట్టుకుని దాని కోసం ప్రయత్నం చేశారు. నిద్రహారాలు మానుకుని అన్నింటినీ వదిలేసుకుని, చివరకు తమను తాము కోల్పోయి అనుకున్న దానిని సాధించారు. అలాంటి వాడే లియోనెల్ మెస్సీ.
ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మెస్సీ(Messi Success) ఇవాళ వేల కోట్ల రూపాయలకు బ్రాండ్ విలువ కలిగిన ఆటగాడు. తను తప్పుకుంటున్నట్లు ప్రకటించినా తన వాల్యూ ఏమాత్రం తగ్గలేదని..తగ్గేదే లేదని చాటి చెప్పాడు. తన సారథ్యంలో జట్టును ఛాంపియన్ గా నిలబెట్టిన మెస్సీ ఈ ప్రపంచాన్ని జయించినంత ఆనందం పొందాడు.
కారణం తను కావాలని కోరుకున్నాడు. దానిని సాధించాడు. అందుకే సక్సెస్ ఇచ్చే కిక్కు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే మెస్సీని అన్ని కాలాలలో ఎన్నదగిన ఫుట్ బాల్ దిగ్గజంగా పేర్కొన్నారు. ఇప్పుడు వరల్డ్ వైడ్ గా అతడు హీరో. ఓ ఐకాన్ కూడా.
మెస్సీ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది పిల్లలు ఫుట్ బాల్ ను ఇష్ట పడుతున్నారు. ఈ స్టార్ ఫుట్ బాలర్ ను చూసి నేర్చుకోవాల్సింది ఒక్కటే ఒత్తిడి లోనూ ప్రశాంతంగా ఉండడం అదే విజయానికి మూల మంత్రం అని.
Also Read : ఇది అర్జెంటీనా ప్రజలందరి కల – మెస్సీ