Meta Lay Offs : మెటాలో కొలువుల కోత
బిగ్ షాక్ ఇచ్చిన జుకర్ బర్గ్
Meta Lay Offs : ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా సిఇవో మార్క్ జుకర్ బర్గ్ కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఇప్పటికే ఆర్థిక మాంద్యం నెపంతో ట్విట్టర్, అమెజాన్ , గూగుల్ , పొలారిస్, మైక్రో సాఫ్ట్ , తదితర దిగ్గజ కంపెనీలన్నీ ఇప్పటికే పలువురు ఉద్యోగులను సాగనంపాయి.
తాజాగా మెటాలో(Meta Lay Offs) మరికొందరికి పింక్ లెటర్లు ఇచ్చారు సిఈవో. పెద్ద ఎత్తున తొలగించినట్లయితే ఇబ్బందులు ఏర్పడుతాయని భావించిన కంపెనీలు ఉన్నట్టుండి మెల మెల్లగా కొందరినీ ఇంటికి పంపించేస్తున్నాయి.
Meta Lay Offs Viral
దీనికి తొలుత శ్రీకారం చుట్టారు టెస్లా చైర్మన్, ట్విట్టర్ సిఈవో ఎలాన్ మస్క్. మరో వైపు రోజు రోజుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడంతో సాధ్యమైనంత మేరకు ఉన్న కొందరితోనే నెట్టుకు రావాలని ఐటీ కంపెనీలు భావిస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా మెటా మార్కెటింగ్ , సైట్ సెక్యూరిటీ, ఎంటర్ ప్రైజ్ ఇంజనీరింగ్ , ప్రోగ్రాం మేనేజ్ మెంట్ , కంటెంట్ స్ట్రాటజీ , కార్పొరేట్ కమ్యూనికేషన్స్ విభాగాలలో పలువురిపై వేటు వేసింది. మరోసారి పెద్ద ఎత్తున తీసేసేందుకు రెడీ అయ్యారని సమాచారం. దీంతో పని చేస్తున్న వారు బిక్కుబిక్కుమంటూ ఆందోళనకు గురవుతున్నారు.
Also Read : Minister KTR Modi : మోదీ కామెంట్స్ కేటీఆర్ సీరియస్