MI vs GG WPL 2023 : ద‌ర్జాగా ప్లే ఆఫ్ కు ముంబై ఇండియ‌న్స్

తిరుగులేని ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శించిన టీం

MI vs GG WPL 2023 : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆధ్వ‌ర్యంలో మొద‌టిసారిగా చేప‌ట్టిన మ‌హిళల ప్రిమీయ‌ర్ లీగ్ లో హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ సార‌థ్యంలోని ముంబై ఇండియ‌న్స్(MI vs GG WPL 2023) వ‌రుస విజ‌యాల‌తో చ‌రిత్ర సృష్టించింది. ప్ర‌స్తుతం కౌర్ భార‌త మ‌హిళ‌ల జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హిస్తోంది. ఇక భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసిన స్మృతీ మంధాన కెప్టెన్సీ లోని ఆర్సీబీ ఐదు మ్యాచ్ ల‌లో ప‌రాజ‌యం పాలైంది. ఇక ముంబై వ‌రుస‌గా విజ‌యాలు సాధిస్తూ పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లో నిలిచింది.

దాంతో ముంబై ఇండియ‌న్స్ నేరుగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. 10 పాయింట్ల‌తో నెంబ‌ర్ వ‌న్ గా నిలిచింది. బ్యాటింగ్ లో కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ , య‌స్తిక భాటియా దుమ్ము రేపారు. బౌలింగ్ లో బ్రంట్ , మాథ్యూస్ స‌త్తా చాట‌డంతో గెలుపు సులువుగా మారింది. లీగ్ లో భాగంగా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో 55 ప‌రుగుల తేడాతో గుజ‌రాత్ జెయింట్స్ పై గ్రాండ్ విక్ట‌రీని సాధించింది. ఇంకా మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.

కానీ నేరుగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 162 ర‌న్స్ చేసింది. కౌర్ 51 , భాటియా 44 ర‌న్స్ చేశారు. బ్రంట్ 36 ర‌న్స్ తో సత్తా చాటింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ జెయింట్స్ 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 107 ర‌న్స్ మాత్ర‌మే చేసింది. కెప్టెన్ రాణా 20 ర‌న్స్ చేస్తే డియోల్ 22 , సుష్మ వ‌ర్మ 18 , మేఘ‌న 16 ప‌రుగులు చేశారు. హీలీ మాథ్యూస్ 23 ప‌రుగులు ఇచ్చి 3 వికెట్లు తీసింది స‌త్తా చాటింది.

Also Read : ఆర్సీబీ ప‌రాజ‌యాల ప‌రంప‌ర‌

Leave A Reply

Your Email Id will not be published!