MI vs RR IPL 2023 : ముంబై గెలిచేనా రాజస్థాన్ రాణించేనా
వాంఖెడే స్టేడియంలో సత్తా చాటేది ఎవరో
MI vs RR IPL 2023 : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్)లో కీలకమైన మ్యాచ్ కు వేదిక కానుంది ముంబైలోని వాంఖడే స్టేడియం. కేరళ స్టార్ హిట్టర్ సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్(MI vs RR IPL 2023) తలపడనున్నాయి. పాయింట్ల పట్టిలో రాజస్థాన్ 2వ స్థానంలో కొనసాగుతోంది. 8 మ్యాచ్ లు ఆడింది. 5 మ్యాచ్ లలో గెలుపొందగా 3 మ్యాచ్ లలో ఓటమి పాలైంది.
ఇక ముంబై ఇండియన్స్ 7 మ్యాచ్ లు ఆడగా 4 మ్యాచ్ లలో విజయం సాధించగా 3 మ్యాచ్ లలో పరాజయం మూటగట్టుకుంది. ఇవాళ అసలైన పోరాటానికి ఇరు జట్లు రెఢీ అవుతున్నాయి. ప్రారంభంలో రెండు మ్యాచ్ లలో ఓడి పోయిన ముంబై ఆ తర్వాత సత్తా చాటింది. ప్లే ఆఫ్ కు చేరుకోవాలంటే మరికొన్ని మ్యాచ్ లలో గెలవాల్సి ఉంటుంది ముంబైకి.
ఈ మ్యాచ్ ఆ జట్టుకు అత్యంత కీలకం. ఇక ఇరు జట్లు ఇప్పటి దాకా ఐపీఎల్ లో 27 మ్యాచ్ లు ఆడాయి. ముంబై ఇండియన్స్ 14 మ్యాచ్ లలో గెలిస్తే రాజస్థాన్ రాయల్స్ 12 మ్యాచ్ లలో విజయం సాధించింది. ఒక మ్యాచ్ లో ఫలితం రాలేదు.
జట్ల పరంగా చూస్తే ముంబై ఇండియన్స్ లో రోహిత్ శర్మ(Rohit Sharma) కెప్టెన్ , ఇషాన్ కిషన్ , కామెరూన్ గ్రీన్ , సూర్య కుమార్ యాదవ్ , టిమ్ డేవిడ్ , నేహాల్ వధేరా, కుమార్ కార్తికేయ, తిలక్ వర్మ, అర్జున్ టెండూల్కర్ , మెరెడిత్ , జోఫ్రా ఆర్చర్ , పీయూష్ చావ్లా, జాసన్ ఆడతారు.
ఇక రాజస్థాన్ పరంగా చూస్తే సంజూ శాంసన్ కెప్టెన్ . యశస్వి జైశ్వాల్ , జోస్ బట్లర్ , పడిక్కల్ , షిమ్రోన్ హెట్మెయర్ , కులదీప్ యాదవ్ , ధ్రువ్ జురెల్ , రవిచంద్రన్ అశ్విన్ , జాసన్ హోల్డర్ , ఆడమ్ జంపా, ట్రెంట్ బౌల్ట్ , సందీప్ శర్మ, చాహల్ ఉన్నారు.
Also Read : చెన్నై పంజాబ్ నువ్వా నేనా