Minister Jaishankar: నేరస్థులకు శిక్ష పడాల్సిందే – పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన క్వాడ్‌

నేరస్థులకు శిక్ష పడాల్సిందే - పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన క్వాడ్‌

Jaishankar : జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని క్వాడ్‌ నేతలు తీవ్రంగా ఖండించారు. అమెరికాలో క్వాడ్ విదేశాంగశాఖ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉగ్రదాడికి పాల్పడిన నేరస్థులకు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేవారికి త్వరగా శిక్ష పడాలని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఉగ్రవాదంతో సహా హింసాత్మక తీవ్రవాద చర్యలను క్వాడ్‌ ఖండిస్తుంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకునే చర్యలకు మా సహకారం ఉంటుంది. ఏప్రిల్‌ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని పేర్కొంది.

Union Minister Jaishankar – ట్రంప్‌ మాటలు ఉత్తుత్తివే, మోదీతో వాన్స్‌ మాట్లాడినప్పుడు నేనూ ఉన్నా – జైశంకర్‌

వాణిజ్య అవకాశాలను చూపించి భారత్‌-పాకిస్థాన్‌లు కాల్పుల విరమణ చేసేలా వారిపై ఒత్తిడి తీసుకువచ్చానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేస్తున్న వ్యాఖ్యలన్నీ ఉత్తుత్తివేనని భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ (Jaishankar) కొట్టిపారేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్‌ చర్చలు జరిపినప్పుడు తాను ఆ గదిలోనే ఉన్నానని సోమవారం న్యూయార్క్‌లో ‘న్యూస్‌వీక్‌’ వారపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ‘‘భారత్‌పై పాక్‌ పెద్దఎత్తున దాడిచేసే అవకాశం ఉందని మే 9న ఫోన్లో వాన్స్‌ చెప్పారు. ఆ మాటల్ని మోదీ పట్టించుకోలేదు. పైగా తామూ స్పందించాల్సి వస్తుందని సంకేతాలిచ్చారు. ఆ మర్నాడే పాక్‌ మాపై దాడులకు దిగింది. దానిపై తక్షణం మేం స్పందించాం. మరుసటిరోజు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో నాకు ఫోన్‌ చేశారు. మాట్లాడేందుకు పాక్‌ సిద్ధంగా ఉందన్నారు. ఏం జరిగిందో చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. మిగిలింది మీకే వదిలేస్తున్నా..’’ అని చెప్పారు.

Also Read : CEC Gyanesh Kumar: నివసించే చోట మాత్రమే ఓటరుగా నమోదు కావాలి – సీఈసీ

Leave A Reply

Your Email Id will not be published!