KTR : యువతకు ఖుష్ కబర్ ఐటీ బేఫికర్ – కేటీఆర్
త్వరలో ఐటీ హబ్ ల ప్రారంభం
KTR : దేశానికి తలమానికంగా మారింది హైదరాబాద్. ప్రధానంగా ఐటీ రంగంలో దూసుకు పోతోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత గణనీయంగా మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం వ్యాపారవేత్తలు, కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ పరిచింది. ఒక్క ఐటీ రంగమే కాకుండా ఫార్మా, లాజిస్టిక్ , తదితర రంగాలకు సంబంధించిన కంపెనీలు ఇక్కడ కొలువు తీరాయి.
ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన దిగ్గజ కంపెనీలు భాగ్య నగరానికి క్యూ కట్టాయి. ఇంటర్నెట్ కనెక్టివిటీ మరింత పెరగడంతో ఐటీ సెక్టార్ ను దిగువ శ్రేణి పట్టణాలకు విస్తరించేలా చేసింది సర్కార్. దీని వల్ల గ్రామీణ ప్రాంతాలలో ఐటీ , బిజినెస్ పరంగా చదువుకున్న, నైపుణ్యం , ఆసక్తి కలిగిన యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి.
ఇదే విషయాన్ని ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్(KTR) వెల్లడించారు. ఇందులో భాగంగా వచ్చే నెల జనవరిలో మహబూబ్ నగర్, నిజామాబాద్ లలో ఐటీ హబ్ లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. త్వరలోనే సిద్దిపేట, నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో కూడా ఐటీ హబ్ లు పూర్తవుతాయని స్పష్టం చేశారు కేటీఆర్.
ఇప్పటికే కొలువు తీరిన ద్వితీయ శ్రేణి నగరాలైన వరంగల్ , కరీంనగర్ , ఖమ్మం ఐటీ హబ్ లలో వేల ఉద్యోగాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని వెల్లడించారు మంత్రి కేటీఆర్.
ఆయా నగరాలలో ఐటీ విస్తరణపై తాజా పరిస్థితిని కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఐటీ సెక్టార్ కు ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
Also Read : చైనా కంపెనీలకు షాక్ యుఎస్ ఝలక్