KTR IT Tower : తెలంగాణలో ఐటీ విప్లవం
స్పష్టం చేసిన మంత్రి కేటీఆర్
KTR IT Tower : హైదరాబాద్ – దేశంలోనే ఐటీ పరంగా తెలంగాణ టాప్ లో ఉందన్నారు మంత్రి కేటీఆర్. ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా ఇతర ప్రాంతాలలో కూడా ఐటీ టవర్లను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు.
సోమవారం అత్యంత భారీ ఖర్చుతో నిర్మించిన టవర్లను ఆయన ప్రారంభించారు. నల్లగొండలో ఐటీ టవర్ తో పాటు సూర్యా పేటలో అత్యాధునిక వసతి సౌకర్యాలతో నిర్మించిన ఐటీ హబ్ ను ప్రారంభించారు.
KTR IT Tower Updates
అంతే కాకుండా హైదరాబాద్ నగరంలోని మలక్ పేటలో ఐటీ టవర్ కు పునాది రాయి వేశారు మంత్రి కేటీఆర్(Minister KTR). ఇందులో భాగంగా హైదరాబాద్, తెలంగాణ వ్యాప్తంగా ఐటీ పరిశ్రమ అభివృద్దికి రాష్ట్ర సర్కార్ ఇతోధికంగా కృషి చేస్తోందని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్.
ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన ఐటీ కంపెనీలన్నీ హైదరాబాద్ లో కొలువు తీరాయని, మరికొన్ని మన నగరాన్ని కావాలని ఎంపిక చేసుకుంటున్నాయని తెలిపారు.
ఐటీనే కాకుండా ఫార్మా, లాజిస్టిక్ , తదితర రంగాలకు చెందిన కంపెనీలు సైతం ఇక్కడ కొలువు తీరాయని ఇది మన దక్షతకు నిదర్శనమని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్.
Also Read : AP CID Summons : మాజీ మంత్రి నారాయణకు సమన్లు