Minister KTR : బీఆర్ఎస్ వల్లనే హైదరాబాద్ అభివృద్ది
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
Minister KTR : హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీపై, నేతలపై నిప్పులు చెరిగారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. డబ్బు మదంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నాణ్యత లేని కరెంట్ , కాలి పోయే మోటార్లు, ఎరువులు, విత్తనాల కొరత తప్పదన్నారు కేటీఆర్. తెలంగాణ ప్రజలే తమకు కొండత ధైర్యమని పేర్కొన్నారు.
Minister KTR Appreciates his Ruling
ప్రతిపక్ష పార్టీలకు 11 సార్లు ఛాన్స్ ఇస్తే ఏం చేశారంటూ నిలదీశారు ఐటీ మంత్రి(Minister KTR). ఒక్క ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి వీళ్లకు అంటూ నిలదీశారు. బోర్ కొట్టిందంటూ కొత్త సర్కార్ రావాలని కోరుకుంటున్నారా అని అనుమానం వ్యక్తం చేశారు కేటీఆర్.
అభివృద్ది చేసే వాళ్లు ఇంకొన్నేళ్లు ఉంటే తప్పేంటి అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్ లో అభివృద్ది ఇప్పటి దాకా చేసింది ట్రైలర్ మాత్రమేనని అసలు సినిమా ముందుందని స్పష్టం చేశారు. వచ్చే కాలంలో తామే పవర్ లోకి వస్తామని , హైదరాబాద్ ను అభివృద్ది చేసి చూపిస్తామని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆయన కోడంగల్ లో , కామా రెడ్డిలో ఓడి పోవడం ఖాయమని జోష్యం చెప్పారు. 75 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ఏం చేసిందంటూ ప్రశ్నించారు.
Also Read : CM KCR : జానా రెడ్డి జాన్తా నై – కేసీఆర్