Minister KTR : టీడీపీ ఆందోళనలు ఒప్పుకోం
స్పష్టం చేసిన మంత్రి కేటీఆర్
Minister KTR : హైదరాబాద్ – ఏపీ స్కిల్ స్కాం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ చీఫ్ , ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమంటూ టీడీపీ ఆందోళనలు చేపడతామంటే తాము ఒప్పుకునే ప్రసక్తి లేదంటూ స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్.
Minister KTR Comments Viral
మెట్రో ట్రైన్ లో , ఐటీ కార్యాలయాల వద్ద, నగరంలోని ప్రధాన కూడళ్లలో ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు చేస్తామంటే తాము ఒప్పుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. సోమవారం ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందించారు.
ఒకవేళ చంద్రబాబుకు మద్దతు ఇవ్వాలని అనుకుంటే ముందస్తుగా పోలీసులతో అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్(Minister KTR). చంద్రబాబు సమస్య ఏపీకి చెందినదని, తమకు అక్కర్లేదన్నారు. తాము పట్టించుకునే ప్రసక్తి లేదన్నారు మంత్రి.
ఒకవేళ కాదు కూడదని అనుకుని , ఇదే రీతిన ఆందోళనలు చేస్తూ పోతామంటే తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఎవరైనా , ఏ స్థాయిలో ఉన్నా అరెస్ట్ చేస్తారని హెచ్చరించారు. ఇది రాజకీయ పరమైన సమస్య. బాబు అరెస్ట్ తో తెలంగాణకు ఏం సంబంధం అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.
Also Read : AP CM YS Jagan : ఐటీ హబ్ గా విశాఖ – జగన్