IT HUB Nizamabad : ఐటీ హబ్ నిజామాబాద్ రెడీ
వెల్లడించిన మంత్రి కేటీఆర్
IT HUB Nizamabad : ఐటీ పరంగా తెలంగాణ రాష్ట్రం దూసుకు వెళుతోంది. ఎప్పుడైతే యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా పేరు పొందిన కేటీఆర్(KTR) ఐటీ , పరిశ్రమల, పురపాలిక శాఖ మంత్రిగా కొలువు తీరాక కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని టైర్ -2 నగరాలు, పట్టణాలకు తీసుకు వెళ్లేందుకు శత విధాలుగా ప్రయత్నం చేశారు కేటీఆర్. ఈ ప్రయత్నాలలో భాగంగా ఆగస్టు 9న బుధవారం ఐటీ హబ్ ను ప్రారంభించ బోతున్నారు. ఈ విషయాన్ని మంత్రి ట్విట్టర్ వేదికగా మంగళవారం వెల్లడించారు.
IT HUB Nizamabad Announced by KTR
ఐటీ హబ్ లో యువకులకు నూతన ఆవిష్కరణలు, నైపుణ్యాలను పెంపొందించడంలో సహాయ పడేందుకు ఎంబెడెడ్ టీ హబ్ , టాస్క్ సెంటర్ కూడా ఏర్పాటు అయ్యాయి. యువత ఆకాంక్షాలకు రెక్కలు తొడగడమే తమ ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. ఇదే తెలంగాణ అభివృద్ది కథకు కీలకమైన చోదకంగా మారనుందని ఆశా భావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన ఐటీ హబ్ ను ప్రారంభించ బోతున్నందుకు సంతోషంగా , అంతకు మించిన ఆనందంగా ఉందన్నారు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు.
రాబోయే కాలంలో ఇక్కడి నుంచి అమెరికాకు వెళ్లడం కాకుండా అక్కడి నుంచి ఐటీ పరంగా పని చేసేందుకు తెలంగాణకు రావాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు కేటీఆర్.
Also Read : Kottara Kottu Teenmaaru : భోళా శంకర్ ‘కొట్టరా కొట్టు’ సూపర్