Minister KTR : కాంగ్రెస్ ధోకా బీఆర్ఎస్ పక్కా
ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్
Minister KTR : ఖానాపూర్ – రాష్ట్రంలో ఎన్నికల నగారా దుమ్ము రేపుతోంది. మాటల తూటాలు పేలుతున్నాయి. అన్ని పార్టీలకు జనం తండోప తండాలుగా తరలి వస్తున్నారు. కానీ ఓటు ఎవరికి వేస్తారో తెలియడం లేదు. దీంతో ఆయా పార్టీలన్నీ తలలు పట్టుకుంటున్నాయి.
Minister KTR Comments on Congress
ఇక ఎన్నికల ప్రచారంలో ఈసారి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మారి పోయింది. బీజేపీ ఉన్నా అంతగా ప్రభావం చూప లేక పోతోంది. ఆ పార్టీ బీఆర్ఎస్ కు బీ టీమ్ గా ఉందన్న విమర్శలు లేక పోలేదు. దీంతో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Minister KTR) కీలకంగా మారారు. ఆయన సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. నిన్న నగరాన్ని చుట్టేశారు.
శుక్రవారం ఖానాపూర్ లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. మోసానికి చిరునామా కాంగ్రెస్ పార్టీ అని, వా పార్టీకి ఓటు వేస్తే ఇక మనల్ని మనం మోసం చేసుకున్నట్టేనని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు కేటీఆర్. ఖానాపూర్ లో తమ అభ్యర్థిని గెలిపిస్తే తాను దత్తత తీసుకుంటానని అన్నారు.
అన్ని రంగాలలో అభివృద్ది చేస్తామని అర చేతిలో స్వర్గం చూపించారు. తాను ఆయా పార్టీల లాగా బోగస్ మాటలు మాట్లాడనంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్. మొత్తంగా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది మిస్టరీగా మారింది.
Also Read : Harish Rao : చిదంబరం క్షమాపణ చెప్పాల్సిందే