Minister Nara Lokesh: ప్రధాని మోదీతో మంత్రి నారా లోకేష్ ఫ్యామిలీ భేటీ

ప్రధాని మోదీతో మంత్రి నారా లోకేష్ ఫ్యామిలీ భేటీ

Minister Nara Lokesh : ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా భేటీ అయ్యారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఈ భేటీ జరిగింది. శనివారం సాయంత్రం ఢిల్లీకు చేరుకున్న మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులు… ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసానికి చేరుకుని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ ప్రధానిని కలిశారు. సుమారు గంటన్నరపాటు వీరు ప్రధానితో సమావేశమయ్యారు. దీనితో ప్రధానితో మంత్రి నారా లోకేష్ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Minister Nara Lokesh Meet

ఇటీవల అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీకు… మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. ఈ సందర్భంలో కుటుంబ సమేతంగా వచ్చి తనను కలవాలని నారా లోకేష్‌ ను ప్రధాని మోదీ కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా ప్రధానితో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా నారా లోకేష్, బ్రాహ్మణిని కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న ప్రధాని మోదీ, దేవాన్ష్‌ను ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని మాట్లాడారు. ఈ భేటీలో రాష్ట్రంలోని పలు అంశాలు వీరిరువురి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం.

Also Read : Minister Satyakumar Yadav: మంత్రి సత్యకుమార్ యాదవ్ పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ 

Leave A Reply

Your Email Id will not be published!