Minister Ram Prasad Reddy : జగన్ అవినీతి చేసిన ప్రతి రూపాయిని వెనక్కి తీసుకువస్తాం
Ram Prasad Reddy : చిత్తూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అధ్యక్షతన చిత్తూరు జిల్లా సమీక్ష కమిటీ సమావేశం ఇవాళ(ఆదివారం) జరిగింది. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారుల తీరుపై ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. విద్యాశాఖ ప్రోటోకాల్ పాటించడం లేదని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలు కనీస పరిగణనలోకి తీసుకోలేదని మంత్రికి ఫిర్యాదు చేశారు.
Minister Ram Prasad Reddy Comments
వైసీపీ పాలనలో ప్రజా ప్రతినిధులకు అణిగిమణిగి ఉన్న అధికారులు, కూటమి అధికారంలోకి రాగానే ఎందుకింత మార్పు అంటూ సూటిగా ప్రశ్నించారు. జిల్లా అధికారులు పనితీరు మార్చుకోవాలని మంత్రి హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎంపీ దగ్గు మల్ల ప్రసాద్ రావు, ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్, థామస్, ఎమ్మెల్సీ శ్రీకాంత్, కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు.
Also Read : Minister Komatireddy : ఆ మంచి కార్యక్రమానికి వస్తే ఆయనకే గౌరవం పెరుగుతుంది