RK Roja Minister : లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయం – రోజా
ఏపీ పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి
RK Roja Minister : నేటి సమాజంలో లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని, స్పూర్తి దాయకమని కొనియాడారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి. ఆదివారం బెంగళూరులో జరిగిన లయన్స్ ఇంటర్నేషనల్ 17వ యాన్వుల్ డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ కార్యక్రమానికి మంత్రి ఆర్కే రోజా(RK Roja Minister) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె ప్రసంగించారు.
ఎంత సంపాదించినా ఎవరూ గుర్తు పెట్టుకోరని కానీ కష్ట సమయంలో ఆదుకున్న వారు, సమాజ హితం కోరి సేవ చేసే వారిని ఎల్లప్పుడూ స్మరించుకుంటారని అలాంటి సేవ చేస్తున్నందుకు లయన్స్ క్లబ్ ను, సభ్యులను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు ఆర్కే రోజా సెల్వమణి.
వివిధ రంగాలలో ప్రతిభ కనబర్చిన లయన్స్ క్లబ్ సభ్యులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి ప్రజలకు , సమాజానికి ఉపయోగపడే పనులు, కార్యక్రమాలు మరింతగా చేయాలని కోరారు మంత్రి ఆర్కే రోజా సెల్వమణి(RK Roja). లయన్స్ క్లబ్ వారి కోరిక మేరకు తాను కూడా సభ్యత్వం తీసుకుంటున్నట్లు సభా ముఖంగా ప్రకటించారు.
ఎక్కడైనా పోటీ ఉండడం సహజమని, ప్రతి చోటా పేరు కోసం, ప్రచారం కోసం, ఫోటోల కోసం, సెల్ఫీల కోసం దిగే వారిని చూశానని కానీ ఒక్క లయన్స్ క్లబ్ లో మాత్రం సేవ చేసేందుకు పోటీ పడే వారిని తాను చూస్తున్నానని ఇది పది మందికి స్పూర్తి దాయకంగా నిలుస్తుందన్నారు మంత్రి ఆర్కే రోజా సెల్వమణి. సేవే పరమార్థంగా కొనసాగుతున్న ఈ లయన్స్ క్లబ్ పది కాలాల పాటు వర్దిల్లాలని కోరారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ ఇంటర్నేషనల్ సభ్యులు డిస్ట్రిక్ట్ గవర్్నర్ వినీత ప్రకాశ్ , సీఎస్ఆర్ సౌత్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ కృష్ణారెడ్డి, భక్త వత్సల్ రెడ్డి, నారాయణ నేత్రాలయం చైర్మన్ డాక్టర్ బుజ్జంగ శెట్టి. డాక్టర్ రామ్ రాజ్ , డిస్ట్రిక్ట్ గవర్నర్లు పాల్గొన్నారు.
Also Read : నా తెలంగాణ అభివృద్దికి నమూనా