Minister Sridharbabu: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై కేంద్రం నిర్ణయం తీసుకోవాలి – మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై కేంద్రం నిర్ణయం తీసుకోవాలి - మంత్రి శ్రీధర్‌బాబు
Sridharbabu : హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమని తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. దిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ముగ్గురు కేంద్రమంత్రులను కలిశారు. కేంద్రమంత్రులు కుమారస్వామి, పీయూష్ గోయల్, శ్రీపాద యశోనాయక్ లను కలిసిన శ్రీధర్‌బాబు… కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు కేటాయించిన భూముల అంశంపై చర్చలు జరిపారు. సమస్యల పరిష్కారానికి కేంద్రం చొరవ చూపాలని కోరారు.
Minister Sridharbabu Comments
హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2పై కేంద్రమంత్రివర్గం నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమన్నారు. దీనిపై కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రధాని, కేంద్రమంత్రిని కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. మెట్రోపై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం నిర్ణయం తీసుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర క్యాబినెట్‌లో మెట్రోకు అనుమతి వస్తుందని భావించామన్నారు. దేశ జీడీపీలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.
Also Read : Lalu Prasad Yadav: ఆర్జేడీ జాతీయ అధ్యక్షుడిగా లాలూ ప్రసాద్ యాదవ్ నామినేషన్
