CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్‌ 2047కు టోనీ బ్లెయిర్‌ ప్రశంస

తెలంగాణ రైజింగ్‌ 2047కు టోనీ బ్లెయిర్‌ ప్రశంస

CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ లేఖ రాశారు. ఈ లేఖలో తెలంగాణ రైజింగ్‌-2047ను ప్రశంసించారు. ఇటీవల దిల్లీ పర్యటన సందర్భంగా టోనీ బ్లెయిర్‌తో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)… తెలంగాణ రైజింగ్‌ విజన్‌ 2047 గురించి ఆయనకు వివరించిన విషయం తెలిసిందే. పెట్టుబడులు, ఐటీ, ట్రిలియన్ డాలర్ల ఎకానమీలో లక్ష్యాల గురించి ఆయనతో చర్చించారు. ఈ నేపథ్యంలో టోనీ బ్లెయిర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ ఛేంజ్‌, తెలంగాణ మధ్య అవగాహన ఒప్పందం కుదరగా… రైజింగ్‌ విజన్‌ రూపకల్పన, అమలుకు లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ను ఇరువైపుల ప్రతినిధులు మార్చుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రైజింగ్‌ 2047 తనను ఆకట్టుకుందంటూ సీఎం రేవంత్ రెడ్డిని అభినందించిన టోనీ బ్లెయిర్‌.. ఈ విజన్‌కు సహకరిస్తామని తెలిపారు.

CM Revanth Reddy – రోడ్లపై నీరు నిలిచే చోట ముందస్తు చర్యలు చేపట్టండి – సీఎం రేవంత్‌ రెడ్డి

పట్టణాల్లో, నగరాల్లో అసంపూర్తి పనులను త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన పురపాలకశాఖపై సమీక్ష నిర్వహించారు. మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో అభివృద్ధి పనుల గురించి సీఎంకు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో శానిటేషన్‌, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థపై శ్రద్ధ వహించాలన్నారు. రోడ్లపై నీరు నిలిచే చోట ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓఆర్‌ఆర్‌ వరకు కోర్‌ అర్బన్‌ రీజియన్‌లో భవిష్యత్‌ అవసరాలకు ప్రణాళికలు చేయాలన్నారు. తాగునీటి సరఫరా, డ్రైనేజీ, రోడ్లు, మెట్రో కనెక్టివిటీ, ఎలివేటెడ్‌ కారిడార్లపై పూర్తి ప్రణాళికతో రావాలని చెప్పారు. రాబోయే 25 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.

విద్యా వ్య‌వ‌స్థ‌ను మ‌రింత ప‌టిష్టం చేయాలి – అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) బుధవారం రాష్ట్ర సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. ఈ నేపథ్యంలో అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. అనంతరం మీడియాతో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. విద్యా వ్య‌వ‌స్థ‌ను మ‌రింత ప‌టిష్టం చేయాలని సూచించారు. జిల్లాల్లోని ఐఏఎస్ అధికారులు వారానికి రెండు పాఠ‌శాల‌ల‌ను సంద‌ర్శించాలని నిర్దేశించారు. పాఠ‌శాల‌ల్లో అవ‌స‌ర‌మైన మేర నూతన గ‌దులు నిర్మించాలని ఆదేశించారు. పాఠ‌శాల‌ల్లో సోలార్ కిచెన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణులైన ప్ర‌తి ఒక్క‌రూ ఇంట‌ర్మీడియ‌ట్‌లో చేరేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

ఈ సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, HMDA పరిధిలోని MA&UD సెక్రటరీ ఇలంబర్తి, జిల్లా HMDA కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్ఎంసీ కమిషనర్ RV కర్ణన్, FCDA కమిషనర్ కె. శశాంక, HMWSSB ఎండీ అశోక్ రెడ్డి, MRDCL ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Also Read : Minister Sridharbabu: హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2పై కేంద్రం నిర్ణయం తీసుకోవాలి – మంత్రి శ్రీధర్‌బాబు

Leave A Reply

Your Email Id will not be published!