MK Stalin Mari Selvaraj : మారి సెల్వరాజ్ కు స్టాలిన్ కితాబు
మా మన్నన్ చిత్ర దర్శకుడు
MK Stalin Mari Selvaraj : తమిళ సినిమా దర్శకుడు మారి సెల్వరాజ్ ను ప్రత్యేకంగా అభినందించారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. తన తనయుడు, మంత్రి, నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్ తీసిన మామన్నన్ చిత్రం జూన్ 29న విడుదలైంది. ఈ చిత్రంలో ఉదయనిధి స్టాలిన్ తో పాటు ప్రముఖ కమెడియన్ వడివేలు కూడా నటించారు. విలక్షణమైన దర్శకుడిగా గుర్తింపు పొందారు మారి సెల్వరాజ్. చిత్రం విడుదలైన సందర్బంగా సినిమాకు సంబంధించి పాజిటివ్ టాక్ వచ్చింది.
ఈ సినిమాను నిర్మించడమే కాకుండా ఇందులో ప్రధాన పాత్రలో నటించాడు ఉదయనిధి స్టాలిన్. ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రముఖ నటి కీర్తి సురేష్ నటించింది. ఈ సందర్బంగా ఉదయనిధితో కలిసి దర్శకుడు మారి సెల్వరాజ్ సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin) ను తన నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్బంగా దర్శకుడి మేకింగ్, టేకింగ్ అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు సీఎం.
ఇక మారి సెల్వరాజ్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. భిన్నమైన అంశాలను ప్రాతిపదికగా తీసుకుని తెరకెక్కించాడు. తీసిన సినిమాలు రెండు మూడైనా ఎన్నో అవార్డులు, పురస్కారాలు దక్కాయి దర్శకుడికి. ఉదయనిధితో మారి సెల్వరాజ్ మామన్నన్ కు కథ కూడా తానే రాశాడు. ఇక ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్రలో ఫహద్ ఫాసిల్ కూడా నటించాడు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.
Also Read : PM Modi Wishes : మోదీ ఆషాఢ ఏకాదశి..బక్రీద్ విషెస్
