Vivek Venkata Swamy : కవిత ఎమ్మెల్సీ కాదు లిక్కర్ క్వీన్
బీజేపీ సీనియర్ నేత వెంకట్ స్వామి
Vivek Venkata Swamy Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొని ఈడీ ముందు 9 గంటల పాటు విచారణకు హాజరై బయటకు వచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు మాజీ ఎంపీ , బీజేపీ సీనియర్ నాయకుడు వివేక్ వెంకటస్వామి(Vivek Venkata Swamy Kavitha). ఆమెను లిక్కర్ క్వీన్ అంటూ పేర్కొన్నారు. పదవిని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని మద్యం వ్యాపారాన్ని నిర్వహించిందని ఆరోపించారు. అందుకే సీబీఐ విచారించిందని, ఈడీ నోటీసులు జారీ చేసిందని చెప్పారు.
లిక్కర్ పాలసీని హైదరాబాద్ వేదికగా మార్చారని ఇదంతా లిక్కర్ క్వీన్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జరిగిందని మండిపడ్డారు వివేక్ వెంకటస్వామి. మద్య పాలసీలో భాగంగా 25 శాతం వ్యాట్ కు 1 శాతం తగ్గించారని తెలిపారు. 32 రూపాయల కమీషన్ ను ఏకంగా 340 రూపాయలకు పెంచిన ఘనత ఈమెకే దక్కుతుందని ఎద్దేవా చేశారు.
ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మద్యంపాలు చేశారని ఇప్పుడు ఢిల్లీని కూడా నాశనం చేసే పనిలో పడ్డారంటూ కల్వకుంట్ల కుటుంబంపై నిప్పులు చెరిగారు బీజేపీ నేత. మంచిర్యాల జిల్లా మందమర్రిలో కొందరు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వివేక్ వెంకట స్వామి కీలక ప్రసంగం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కల్వకుంట్ల కుటుంబమే బాగు పడిందన్నారు. సీఎంను కూడా ఏకి పారేశారు. కల్వకుంట్ల కమీషన్ రావు అని ఎద్దేవా చేశారు బీజేపీ నేత.
కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని మండిపడ్డారు. మిషన్ భగీరథలో 40 వేల కోట్లు మెగా కృష్ణారెడ్డితో కలిసి కేసీఆర్ దోచుకున్నాడని సంచలన ఆరోపణలు చేశారు.
Also Read : సీఎం కేసీఆర్ తో కవిత భేటీ