MLA Medipally Sathyam: కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య ఆత్మహత్య !

కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య ఆత్మహత్య !

MLA Medipally Sathyam: తెలంగాణాలోని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం(MLA Medipally Sathyam)… భార్య రూపాదేవి(40) ఆత్మహత్యకు పాల్పడ్డారు. గురువారం రాత్రి 10 గంటల సమయంలో హైదరాబాద్ లో అల్వాల్‌ పంచశీల కాలనీలో తన నివాసంలో బెడ్ రూంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన భర్త, ఎమ్మెల్యే సత్యంతో ఫోన్ లో మాట్లాడిన తరువాత ఇంట్లో తల్లి, ఇద్దరు పిల్లలు ఉండగానే రూపాదేవి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఎంతకూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన రూపాదేవి తల్లి భూలక్ష్మమ్మ డోర్‌ తీయడానికి ప్రయత్నించినా రాలేదు. దీంతో స్థానికుల సాయంతో తలుపులు తీయగా, అప్పటికే రూపాదేవి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్య సమస్యలతో తన కూతురు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని తల్లి భూలక్ష్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు.

MLA Medipally Sathyam….

రూపాదేవి చనిపోవడానికి ముందు భర్తతో మాట్లాడిందని ఆమె తల్లి భూలక్ష్మమ్మ చెప్పింది. విషయంగా తెలియగానే నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే సత్యం హుటాహుటిన తనే కారు నడుపుకుంటూ సిటీకి బయలుదేరారు. విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఎమ్మెల్యే సత్యంను మార్యమధ్యలో ఆపి, ఆస్పత్రికి తన కారులో తీసుకొచ్చారు. భార్య మృతదేహాన్ని చూసి ఎమ్మెల్యే బోరున విలపిస్తూ ఒక్కసారిగా కుప్పకూలారు. దీనితో ఆయనకు ఆదే ఆస్పత్రిలో చికిత్స అందించారు. రూపాదేవి అంత్యక్రియలు శుక్రవారం తిరుమలగిరి ఆర్టీసీ కాలనీలోని స్వర్గధామంలో జరిగాయి. గురువారం రాత్రి నుంచి రూపాదేవి అంత్యక్రియలు అయ్యే వరకు పొన్నం ప్రభాకర్‌ సత్యం వెంటే ఉన్నారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, సుద్దాల దేవయ్య తదితరులు మేడిపల్లి సత్యంను పరామర్శించారు.

Also Read : MLA Medipally Sathyam: కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య ఆత్మహత్య !

Leave A Reply

Your Email Id will not be published!