MLC Janga Krishna Murthy: ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు !
ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు !
MLC Janga Krishna Murthy: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ…. ఏపీలో అధికార వైసీపీకు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వై నాట్ 175 స్లోగన్ తో వైసీపీ అధిష్టానం మార్పులు చేర్పులు చేస్తుంటే… ఒక్కొక్కరుగా నాయకులు పార్టీను వీడుతున్నారు. పార్టీ మీద, అధిష్టానం మీద అసంతృప్తితో పార్టీను వీడుతున్న నాయకులు… సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి… ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ చెప్పే సామాజిక న్యాయం… నేతిబీరకాయలో నెయ్యిలాంటిదని జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. ప్రభుత్వం, వైసీపీ నాయకులపై దుమ్మత్తి పోసారు. దీనితో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
MLC Janga Krishna Murthy Comments Viral
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి(MLC Janga Krishna Murthy) మాట్లాడుతూ…. వైసీపీలో సామాజిక న్యాయం నేతిబీరకాయలో నెయ్యి లాంటిదని ఎద్దేవా చేశారు. ‘‘బీసీలకు పదవులు ఇచ్చారు తప్ప.. అధికారాలు లేవు. బడుగు, బలహీనవర్గాలకు న్యాయం చేసే పరిస్థితి పార్టీలో లేదు. కీలక పదవులన్నీ ఒకే సామాజిక వర్గం చేతిలోనే ఉన్నాయి. బీసీ వర్గాలు వైకాపాకు దూరమవుతున్నాయి. వాళ్లకు ప్రోటోకాల్ పాటించట్లేదు. బీసీలు ఆత్మగౌరవం కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది. సీఎం జగన్ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ మాటలేగానీ… వారి మనోగతం అర్థం చేసుకోవట్లేదు. రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి తీసుకొచ్చారు. రూ.లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని నడుపుతున్నారు’’ అని విమర్శించారు. ఏపీలోని 139 బీసీ సామాజిక వర్గాలు జగన్ను నమ్మాయని. కానీ జగన్ వారికి అన్యాయం చేశారని ఆరోపించారు. ఏపీలోని 56 కార్పొరేషన్ ఛైర్మన్లను జగన్ కలవలేదన్న జంగా కృష్ణమూర్తి… ఏ ఒక్క దానిలో కూడా నిధులు లేవని స్పష్టం చేసారు.
Also Read : YS Sharmila Met CM Revanth: సీఎం రేవంత్ ను కలిసిన ఏపీపీసీసీ చీఫ్ షర్మిల !