MLC Janga Krishna Murthy: ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు !

ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు !

MLC Janga Krishna Murthy: సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి(MLC Janga Krishna Murthy) ఏపీ ప్రభుత్వం బిగ్‌ షాక్‌ ఇచ్చింది. పార్టీ ఫిరాయింపు కారణంగా శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు ఆయనపై అనర్హత వేటు వేశారు. వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన జంగా… ఆ తర్వాత టీడీపీలో చేరారు. దీనితో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని వైసీపీ విప్‌ లేళ్ల అప్పిరెడ్డి అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ కు ఫిర్యాదు చేశారు. లేళ్ళ అప్పిరెడ్డి ఫిర్యాదుపై విచారణ నిర్వహించిన శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేనురాజు… ఆయన నుంచి వివరణ తీసుకున్నారు. చివరకు ఎమ్మెల్సీగా కృష్ణమూర్తి అనర్హుడని పేర్కొంటూ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ బుధవారం అర్ధరాత్రి గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

MLC Janga Krishna Murthy – నాపై అనర్హత వేటు వేయడం కక్షపూరిత చర్య-జంగా కృష్ణమూర్తి

ఎమ్మెల్సీగా ఉన్న తనపై అనర్హత వేటు వేయడం కక్షపూరిత చర్య అని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. మౌఖికంగా తన వివరణ తీసుకోకుండానే అనర్హత వేటు వేశారన్నారు. దీనిని వెనుకబడిన వర్గాలపై తీసుకున్న చర్యగా భావిస్తున్నట్లు చెప్పారు. ‘‘ఎమ్మెల్సీ పదవి నాకు వ్యక్తిగతంగా కాదు… నా బీసీ వర్గాలకు ఇచ్చింది. మండలి ఛైర్మన్‌ పై ఒత్తిడి తెచ్చి అనర్హత వేటు వేయించారు. బీసీ నాయకత్వాన్ని అణగదొక్కే ప్రయత్నం వైసీపీ చేసింది. ఆ పార్టీలో బీసీలను వాడుకొని వదిలేస్తారు’’ అని వ్యాఖ్యానించారు.

 

జంగా కృష్ణమూర్తి… 2009 నుంచి 2019 మధ్య పల్నాడు జిల్లా గురజాల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన్ని వైసీపీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేసింది. వైఎస్సార్‌సీపీలో ఉన్నప్పుడు మండలిలో విప్‌గా కూడా పని చేశారు. అయితే ఇటీవల ఆయన వైసీపీకు గుడ్ బై చెప్పి టీడీపీలో చేరడంతో… వైసీపీ ఫిర్యాదు మేరకు శాసనమండలి చైర్మెన్ అతనిపై అనర్హత వేటు వేసారు.

Also Read : YS Jagan Mohan Reddy: దేశం ఆశ్చర్యపోయేలా మన విజయం ఉండబోతుంది – సీఎం జగన్

Leave A Reply

Your Email Id will not be published!