MLC Kavitha Arrest Comment : లిక్కర్ స్కాం కిం కర్తవ్యం
అరెస్ట్ ల పర్వం బీఆర్ఎస్ లో కలకలం
MLC Kavitha Arrest Comment : దేశ రాజకీయాలు వేడిని రాజేస్తున్నాయి. ఇదే సమయంలో నువ్వా నేనా అంటున్నాయి బీజేపీ, బీఆర్ఎస్ లు. ఇప్పటికే మోదీతోనే తన యుద్దం అని ప్రకటించారు సీఎం కేసీఆర్. మాటలతో మంటలు పుట్టించగలిగే సత్తా కలిగిన రాజకీయ నాయకుడు.
ఎప్పుడు ఎవరిని ఎలా దెబ్బ కొట్టాలో కేసీఆర్ కు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ఇవాళ తెలంగాణలో ఎవరు కేసీఆర్ మనిషో తెలియక ప్రతిపక్షాలు బెంబేలెత్తి పోతున్నాయి. వ్యవస్థల్ని ఎలా నియంత్రించాలో తెలిసిన చాణక్యుడు సీఎం. ప్రస్తుతం ఆయన ముందున్న సవాల్ ఒక్కటే తన కూతురు ఎదుర్కొంటున్న లిక్కర్ స్కాం కేసు.
దేశంలో ఈ మద్యం కుంభకోణం కలకలం రేపింది. ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థలు జల్లెడ పట్టాయి. మొత్తం 34 మందిపై అభియోగాలు మోపింది. సోదాలు చేపట్టింది. 10 మందిని అరెస్ట్ చేసింది.
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది. కోర్టులో హాజరు పరిచింది. ఆయన కూడా తీహార్ జైలుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలని డిసైడ్ అయిన బీజేపీ మెల మెల్లగా పావులు కదుపుతోంది.
ఈ కేసుకు సంబంధించి ఇటీవల కోర్టుకు సమర్పించిన రెండో ఛార్జ్ షీట్ లో సీఎం కూతురు ఎమ్మెల్సీ కవితతో(MLC Kavitha) పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్లను ప్రస్తావించింది. వీరికి కూడా ఈ లిక్కర్ దందాతో నేరుగా సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది.
అంతే కాదు సౌత్ గ్రూప్ ద్వారా తతంగం నడిచిందని రూ. 100 కోట్లు చేతులు మారాయని ఈ నిధులను పంజాబ్ , గోవా ఎన్నికల్లో ఆప్ ఖర్చు చేసిందని స్పష్టం చేసింది. ఒకవేళ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళితే గనుక ఆ లోపు కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
అయితే వీటిని తేలిగ్గా తీసుకున్నారు కవిత(MLC Kavitha). తాను ఎలాంటి తప్పు చేయలేదని ప్రకటించారు. ఇప్పటికే సీబీఐ నోటీసులు ఇచ్చింది. కవితను ఆమె ఇంట్లో ప్రశ్నించింది. మరో వైపు వైసీపీ ఎంపీ శ్రీనివాసులు రెడ్డి కొడుకును అదుపులోకి తీసుకుంది.
ఆయన సౌత్ గ్రూప్ లో కీలకంగా ఉన్నారు. ఇక కవిత వద్ద ఉన్న అభిషేక్ రావును అరెస్ట్ చేసింది. ఆడిటర్ గోరంట్ల బుచ్చి బాబును ఢిల్లీకి పిలిపించింది విచారణ పేరుతో.
అతడిని కూడా అదుపులోకి తీసుకుంది. సో ఇప్పటి వరకు పెద్ద తలకాయలన్నీ జైలు ఊచలు లెక్క బెడుతున్నాయి. తర్వాత ఎవరు అనే ప్రశ్న అంతటా వినిపిస్తోంది. ఇక మిగిలింది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితనే(MLC Kavitha Arrest Comment).
ఇదే సమయంలో బీజేపీ చాలా తెలివిగా పావులు కదుపుతోంది. ఒక్కటొక్కటిగా ఆధారాలతో సహా బయట పెడుతోంది. ప్రత్యర్థుల నోళ్లు మూయిస్తోంది. కవితకు సంబంధించిన ప్రతి ఆధారాన్ని సీబీఐ పకడ్బందీగా సేకరించినట్లు సమాచారం.
ఇప్పటికే ఆమె సెల్ ఫోన్టను ధ్వంసం చేసిందన్న ఆరోపణలు చేసింది. మాగుంట రాఘవ, కవిత(MLC Kavitha) కలిసి మొత్తం రాకెట్ నడిపినట్లు నిర్ధారణకు వచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై కోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. విచారణ సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని ఆదేశించింది. దీంతో సీబీఐ దూకుడు పెంచింది. ఈ సమయంలో సీఎం కేసీఆర్ ఏం చేయబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కవితను అరెస్ట్ చేస్తారా లేక నాన్చుతూ కంటిన్యూ చేస్తారా అన్నది వేచి చూడాలి(MLC Kavitha Arrest Comment).
Also Read : సిసోడియాకు సుప్రీం బిగ్ షాక్