MLC Kavitha : కామారెడ్డిలో కేసీఆర్ కు బ్రహ్మరథం
స్పష్టం చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
MLC Kavitha : తెలంగాణలో మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తాజాగా బీఆర్ఎస్ పార్టీ చీఫ్ , సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటించారు. ఆయన ఈసారి జరగబోయే ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేయనున్నారు. ఒకటి గజ్వేల్ కాగా రెండో నియోజకవర్గం కామారెడ్డి. ఇక్కడ ఉన్న గంప గోవర్దన్ తన సీటును సీఎం కోసం త్యాగం చేశారు.
MLC Kavitha Words
ఇదిలా ఉండగా ఇంకా ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాలేదు. కానీ అప్పుడే బీఆర్ఎస్ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేయడం మొదలు పెట్టింది. ముందుగా తనయురాలు కవిత అక్కడే పర్యటిస్తున్నారు. విస్తృతంగా ప్రజలతో మమేకం అవుతున్నారు.
ఇదిలా ఉండగా కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన ఆయా గ్రామాలలో సర్పంచ్ లు ఏకగ్రీవంగా తాము కేసీఆర్ కు మద్దతు తెలియ చేస్తున్నట్లు తీర్మానాలు చేశారు. ఈ తీర్మానం కాపీలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు(MLC Kavitha) అందజేశారు.
మాచారెడ్డి మండలంలో ఉన్న ఎల్లంపేట, అంకిరెడ్డి పల్లి, నడిమి తాండా, వెనుక తాండా, బోడగుట్ట తాండా, మైసమ్మ చూరు, రాజకన్ పేట్ , వడ్డెర గూడెం, గుంటి తండా, దేవునిపల్లి గ్రామ పంచాయతీలు ఇప్పటికే సీఎం కేసీఆర్ కు మద్దతు తెలియ చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. ఇవాళ మాదారెడ్డి మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు సంబంధిత తీర్మాన ప్రతులను తనకు అందజేయడం సంతోషంగా ఉందన్నారు కవిత.
Also Read : Minister KTR : అమెరికాలో కేటీఆర్ హల్ చల్