MLC Kavitha Launch : మహిళల వాయిస్ ‘షీ ది లీడర్’
పుస్తకాన్ని ఆవిష్కరించిన కవిత, తివారీ
MLC Kavitha Launch : భారత దేశంలోని రాజకీయాలలో ఇంకా మహిళల ప్రాతినిధ్యం అంతంత మాత్రాంగానే ఉందనే విషయం అందరికీ తెలుసు. ఉన్న కొద్ది మందిలో ఎన్నదగిన వారు కొందరే. తాజాగా నిధి శర్మ రచించిన షీ ది లీడర్ పుస్తకాన్ని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha), మనీష్ తివారీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వక్తలు ప్రసంగించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు ఎమ్మెల్సీ కవిత. రాజకీయాల్లో చాలా మంది మహిళలకు ఆమె గొంతుకగా ఉన్నారు. ప్రత్యేకించి బతుకమ్మ తో ఆమె మరింత పాపులర్ అయ్యారు. ఇటీవలే ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు.
MLC Kavitha Launch ‘She The Leader’ Book
నిధి శర్మ రాసిన పుస్తకంలో భారతీయ మహిళలకు రాజకీయాలు ఇప్పటికీ అసాధారణమైన కెరీర్ ఎంపికగా పరిగణించ బడుతున్నాయి. 17వ లోక్ సభ 2019-2024 లో పార్లమెంట్ లో కేవలం 81 మహిళా సభ్యులు మాత్రమే ఉన్నారు. ఇక లోక్ సభ బలంలో కేవలం 15 శాతం మాత్రమే ఉండడం విస్మయానికి గురి చేసే అంశం.
సంఖ్యలో తక్కువగా ఉన్నప్పటికీ మహిళా నాయకురాళ్లు భారత దేశంలో విధాన రూపకల్పనకు ప్రత్యేకమైన సున్నితత్వాన్ని తీసుకు వచ్చారని స్పష్టం చేశారు రచయిత్రి నిధి శర్మ. తర్వాతి తరం రాజకీయ నాయకులుగా మారేందుకు యువ మహిళలను ప్రేరేపించడం కొనసాగించారు.
విమెన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ లో నిధి శర్మ సామాజిక అసమానతలు, పితృస్వామ్య వైఖరులతో పోరాడి జాతీయ చర్చలో తమదైన రాజకీయాలు సృష్టించిన 17 మంది మహిళల గురించి పరిచయం చేశారు నిధి శర్మ.
Also Read : Gaurav Gogoi Comment : ధిక్కార స్వరం ప్రశ్నల వర్షం