Patnam Mahender Reddy : కేబినెట్ లోకి ‘ప‌ట్నం’ ..?

కేసీఆర్ ను క‌లిసిన ఎమ్మెల్సీ

Patnam Mahender Reddy : బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి, ప్ర‌స్తుత ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డికి మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్క‌నుందా. అవున‌నే అంటున్నారు ఆయ‌న అనుచ‌రులు. గ‌తంలో తాండూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పైల‌ట్ రోహిత్ రెడ్డి చేతిలో అనూహ్యంగా ఓట‌మి పాల‌య్యారు.

Patnam Mahender Reddy and Pilot Rohit Met

దీంతో పార్టీలో మంచి ప‌ట్టు క‌లిగిన ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డికి ఎమ్మెల్సీ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు బీఆర్ఎస్ బాస్ సీఎం కేసీఆర్. గ‌తంలో బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో రాష్ట్ర రోడ్డు ర‌వాణా శాఖ మంత్రిగా ప‌ని చేశారు. ఆ త‌ర్వాత జ‌రిగిన మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో చోటు ద‌క్క‌లేదు.

కాగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన పైల‌ట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. ఆనాటి నుంచి నేటి వ‌ర‌కు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మ‌ధ్య ఆధిప‌త్య పోరు కొన‌సాగుతూ వ‌చ్చింది.

తాజాగా కేసీఆర్ త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే శాస‌న స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించి 115 నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశారు. చివ‌రి వ‌ర‌కు ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి(Patnam Mahender Reddy) టికెట్ కోసం ప్ర‌య‌త్నం చేశారు. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. కేసీఆర్ ఆదేశాల మేర‌కు ఇద్ద‌రూ క‌లిసి పోయారు. త్వ‌ర‌లో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటుంద‌ని అందులోకి పట్నం మ‌హేంద‌ర్ రెడ్డిని తీసుకోనున్న‌ట్లు టాక్.

విచిత్రం ఏమిటంటే ఎమ్మెల్సీ తో పాటు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి కేసీఆర్ ను క‌లుసుకోవ‌డం.

Also Read : MLA Rohit Reddy : ఔను వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు

Leave A Reply

Your Email Id will not be published!