Hindustan Zinc Ltd : అమ్మకానికి ‘హిందూస్థాన్ జింక్’ రెడీ
ప్రభుత్వ వాటా క్లోజ్ కు లైన్ క్లియర్
Hindustan Zinc Ltd : ఓ వైపు దేశంలో 75వ వజ్రోత్సవాలు జరుపుకుంటున్నాం ఘనంగా. ప్రతి ఇంటా తిరంగా జెండా ఎగుర వేస్తున్నాం. కానీ ఇన్నేళ్లయినా భారత దేశం ఇంకా వెనుకంజలోనే ఉంది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తీవ్రత పెరుగుతోంది.
దేశ అభివృద్ధిలో కీలక భాగస్వామ్యంగా ఉంటూ వచ్చిన ప్రభుత్వ రంగ సంస్థలను గంప గుత్తగా అమ్మకానికి పెట్టింది మోదీ బీజేపీ ప్రభుత్వం. పేరుకే జాతీయ వాదం అని చెప్పుకుంటూ వస్తున్న ఈ సర్కార్ మొత్తానికి మొత్తంగా తన బాధ్యతల నుంచి తప్పుకుంటోంది.
లాభాలలో ఉన్న వాటిపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే జీవిత బీమా సంస్థను క్లోజ్ చేసే పనిలో ఉంది. ఇక ఎయిర్ ఇండియాను అమ్మేసింది. బీఎస్ఎన్ఎల్ , బీపీసీఎల్ అదే దారిలో ఉంది.
తాజాగా కేంద్ర సర్కార్ ఆధీనంలో ఉన్న హిందూస్థాన్ జింక్(Hindustan Zinc Ltd) లో రూ. 38,000 కోట్ల విలువైన 29.5 శాతం వాటాను విక్రయించేందుకు సీసీఈఏ ఓకే చెప్పింది.
ఈ మొత్తం కేంద్ర ఖజానాకు వస్తుంది. కొన్ని కీలకమైన ప్రైవేటీకరణ ప్రతిపాదనలకు అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో కేంద్రం తన పెట్టుబడుల ఉపసంహరణను వేగవంతం చేయాలని చూస్తోంది.
హిందూస్థాన్ జింక్ లిమిటెడ్ లో ప్రభుత్వం 29.5 శాతం వాటా కలిగి ఉంది. ఈ మేరకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఎట్టకేలకు అమ్మకానికి ఆమోదం తెలిపింది.
హిందూస్థాన్ జింక్ 2002 దాకా ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీ. అదే ఏడాది ఏప్రిల్ లో 26 శాతం వాటాను రూ. 445 కోట్లకు స్టెర్లైట్
ఆపార్చునిటీస్ అండ్ వెంచర్స్ లిమిటెడ్ (ఎస్ఓవీఎల్) కి ఆఫ్ లోడ్ చేసింది.
దీంతో వేదాంత గ్రూప్ నిర్వహణ నియంత్రణలోకి వచ్చింది. వేదాంత గ్రూప్ తర్వాత మార్కెట్ నుండి 20 శాతం నవంబర్ 2003లో ప్రభుత్వం
నుండి మరో 18.92 శాతం కొనుగోలు చేసింది.
హిందూస్థాన్ జింక్ లో దాని యాజమాన్యాన్ని 64.92 శాతానికి పెంచుకుంది. ఇదిలా ఉండగా గంప గుత్తగా ప్రజలకు చెందిన ఆస్తులను
అమ్ముకుంటూ పోతే చివరకు దేశానికి ఏం మిగులుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.
గతంలో కాంగ్రెస్ హయాంలో బీజేపీ విమర్శిస్తూ వచ్చింది. కానీ ఆ పార్టీ కొలువు తీరాక పూర్తిగా దేశాన్ని అమ్మే పనిలో పడింది.
Also Read : అలీబాబాలో 10,000 వేల మంది తొలగింపు