Mohammad Amir : రమీజ్ రజాపై మహ్మద్ అమీర్ ఫైర్
వదిలించుకునే టైం వచ్చేసింది
Mohammad Amir : ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి 20 వరల్డ్ కప్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా మొదటి మ్యాచ్ లోనే నమీబియా శ్రీలంకకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇక టైటిల్ హాట్ ఫేవరేట్ గా ఉన్న పాకిస్తాన్ ఇప్పటి వరకు బోణీ కొట్టలేదు.
పిల్లకూనలైన జింబాబ్వే జట్టుతో కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో ఘోరంగా ఓడి పోయింది. దీంతో సెమీస్ ఆశలు నిలవాలంటే ప్రతి మ్యాచ్ పాకిస్తాన్ విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ తరుణంలో తాజా, మాజీ ఆటగాళ్లు జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ ను , పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు చైర్మన్ రమీజ్ రజాను ఏకి పారేస్తున్నారు.
మహ్మద్ అమీర్ అయితే ఏకంగా చైర్మన్ ను వదిలించుకునే సమయం ఆసన్నమైందన్నాడు. ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. జింబాబ్వే చేతిలో పాకిస్తాన్ ఓటమి పొందడంపై నైతిక బాధ్యత వహిస్తూ పీసీబీ చైర్మన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మహ్మద్ అమీర్(Mohammad Amir) .
జట్టును ఎంపిక చేయడంలో సరైన ఫోకస్ పెట్టలేదన్నాడు. ఓ వైపు భారత జట్టుతో టీమ్ ఇలాగే ఆడి మ్యాచ్ ను పోగొట్టుకుందని అసలు పాకిస్తాన్ టీం ఏం ఆడుతుందో ఎవరికీ తెలియడం లేదని ఎద్దేవా చేశాడు. వెంటనే తప్పుకుంటే బెటర్ అని రమీజ్ రజాకు అమీర్ సూచించాడు.
ఎంపిక చేసిన రోజే అత్యంత పేలవమైన టీమ్ అని తాను చెప్పానని పేర్కొన్నాడు. పీసీబీ చైర్మన్ తనను తాను దేవుడినని భావిస్తున్నారంటూ మండిపడ్డారు అమీర్.
Also Read : జింబాబ్వేతో పాక్ ఓటమిపై ఆగ్రహం