Mohammed Siraj : తిప్పేసిన సిరాజ్ పంజాబ్ షాక్

ఐపీఎల్ లో ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ

Mohammed Siraj : హైద‌రాబాద్ స్పీడ్ స్ట‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ మ‌రోసారి మెరిశాడు. ఈసారి ఐపీఎల్ 16వ సీజ‌న్ లో ప్ర‌తి మ్యాచ్ లోనూ త‌న స‌త్తా చాటుతున్నాడు. ప‌వ‌ర్ ప్లే లో ప‌రుగులు ఇవ్వ‌కుండా క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నాడు. దీంతో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టులో కీల‌క‌మైన బౌల‌ర్ గా మారాడు.

తాజాగా మొహాలీ స్టేడియం వేదిక‌గా కీల‌క లీగ్ మ్యాచ్ జ‌రిగింది. ఆర్సీబీ , పంజాబ్ కింగ్స్ త‌ల‌ప‌డ్డాయి. ముందుగా కెప్టెన్ శిఖ‌ర్ ధావ‌న్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. విరాట్ కోహ్లీ 59 ర‌న్స్ చేస్తే ఫాఫ్ డుప్లెసిస్ 84 ర‌న్స్ తో దంచికొట్టాడు. ఇద్ద‌రూ క‌లిసి భారీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. 16 ఓవ‌ర్ల వ‌ర‌కు ఆడారు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 174 ర‌న్స్ చేశారు.

అనంత‌రం బ‌రిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ కు చుక్క‌లు చూపించాడు మ‌హ్మ‌ద్ సిరాజ్(Mohammed Siraj). 4 ఓవ‌ర్లు మాత్ర‌మే వేసిన సిరాజ్ కేవ‌లం 21 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చాడు. కీల‌క‌మైన 4 వికెట్లు తీశాడు. దీంతో 24 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది పంజాబ్. మొత్తంగా పంజాబ్ ప‌త‌నాన్ని శాషించాడు సిరాజ్. ఈ సంద‌ర్భంగా ఆర్సీబీ స్కిప్ప‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన విరాట్ కోహ్లీ సిరాజ్ ను ప్ర‌త్యేకంగా అభినందించాడు.

పంజాబ్ 154 ర‌న్స్ కే ప‌రిమిత‌మైంది. ఆర్సీబీ(RCB) పాయింట్ల ప‌ట్టిక‌లో మ‌రో ప్లేస్ ముందుకు వెళ్లింది. కాగా.. ఇక పంజాబ్ జ‌ట్టులో ప్ర‌భాసిమ‌న్ సింగ్ 46 ప‌రుగులు చేస్తే , జితేశ్ శ‌ర్మ 41 ప‌రుగులు మాత్ర‌మే చేసి రాణించారు. మిగ‌తా ఆట‌గాళ్లు పూర్తిగా చేతులెత్తేశారు.

Also Read : సిరాజ్ మ్యాజిక్ బెంగ‌ళూరు విక్ట‌రీ

Leave A Reply

Your Email Id will not be published!