#MaheshBabu : మహేష్ బాబుతో స్టెప్పులేయబోతున్న మోనాల్!

MaheshBabu : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయ్ లో శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఈ సినిమా 2022 సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

బిగ్ బాస్ 4 తెలుగులో సందడి చేసిన మోనాల్ గజ్జర్ ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాటలో నటించబోతున్నారని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. బిగ్ బాస్ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి అల్లుడు అదుర్స్ సినిమాలో స్టెప్పులేశారు. ఈ సాంగ్ లో అమ్మడు అందం, తన స్టెప్పులతో అదరగొట్టింది.

అయితే తాజాగా సర్కారు వారి పాటలో మోనాల్ గజ్జర్ కు అవకాశం వచ్చిందని తెలుస్తుంది. మహేష్ బాబుతో కలిసి స్టెప్పులేసే లక్కీ ఛాన్స్ కొట్టేసిందని ఇండస్ట్రీలో నుండి అందుతున్న సమాచారం. ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే..

 

No comment allowed please