#Bobbatlu : ఆంధ్ర స్టైల్ బొబ్బట్లు

ఆంధ్ర స్టైల్ బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..

Bobbatlu : బొబ్బట్లు అంటే తెలియనివారు ఉండరు. రుచి కూడా చాలా బాగుంటుంది. దీనిని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా చేస్తారు. ఇప్పుడు మనం ఆంధ్ర స్టైల్ బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.. ముందుగా దీనికి కావలసిన పదార్ధాలు తయారు చేయు విధానం ఇప్పుడు తెలుసుకుందాం..

కావలసిన పదార్ధాలు :

మైదా – 2 కప్పులు
బొంబాయి రవ్వ – 2 టేబుల్ స్పూన్స్
ఉప్పు – చిటికెడు
నూనె – 1 టేబుల్ స్పూన్
పచ్చి సెనగపప్పు – 1 కప్పు
బెల్లం తరుగు – 1 1/2 కప్పులు
యాలకల పొడి – చిటికెడు
నెయ్యి – కాల్చడానికి సరిపడ

తయారుచేయు విధానం :

ముందుగా మైదా లో బొంబాయి రవ్వ, ఉప్పు వేసి బాగా కలిపి తగినన్ని నీళ్ళు పోసి ముద్దలాగా చేసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసి 2 గంటలు పక్కన పెట్టుకోవాలి. ఈ లోగా పూర్ణం కోసం 30 నిమిషాలు నానబెట్టిన సెనగపప్పు లో నీళ్ళు పోసి 5 విసిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత పప్పులో నీళ్లు ఉంటె వడకట్టి అందులో బెల్లం తురుము యాలుకుల పొడి వేసి బాగా కలిపి ఆ తరువాత మిక్సీ లో వేసి మెత్తని పేస్టు చేసుకోవాలి. తర్వాత పాన్ లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి శెనగపప్పు ముద్దను వేసి మీడియం ఫ్లేమ్ మీద నీరు ఇగిరిపోయి పిండి ముద్ద దగ్గర పడేదాక కలుపుతూ ఉండాలి. తర్వాత స్టవ్ ఆపేసి చల్లార నివ్వాలి.

చల్లారిన తర్వాత చిన్న చిన్న ముద్దలు చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మైదా పిండిని కూడా చిన్న ఉండ తీసుకుని నూనె తో తడి చేసుకున్న చేతి మీద పల్చగా ఒత్తుకుని అందులో సెనగపిండి ముద్ద పెట్టి సీల్ చేయాలి. ఆ తరువాత పోలీథీన్ షీట్ మీద నూనె రాసి పల్చగా ఒత్తుకోవాలి. తర్వాత బాగా వేడెక్కిన పెనం మీద నెయ్యి వేసి రెండు వైపులా కూడా ఎర్రగా కాల్చుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే బొబ్బట్లు రెడీ అయినట్లే.

No comment allowed please