#GoldRate : కళ త‌ప్పిన ప‌సిడిమెరిసిన వెండి

మార్కెట్ పై బ‌డ్జెట్ ఎఫెక్ట్

Gold Rate : నిన్న మొన్న‌టి దాకా చుక్క‌లు చూపించిన బంగారం ధ‌ర భారీగా త‌గ్గింది. ఇంకో వైపు ఏమంత‌గా ప్ర‌భావం చూప‌ని వెండి మెరిసింది. ఇదే ఇవాళ్టీ స్పెష‌ల్. ఎంత త‌గ్గినా లేదా పెరిగినా మ‌హిళ‌లు, పురుషులు మాత్రం ప‌సిడి మీద మోజు మాత్రం తీర‌డం లేదు. మార్కెట్ లో ఎక్క‌డ లేని డిమాండ్ ఉంటోంది బంగారానికి గ‌త రెండేళ్ల నుంచి పెరుగుతూ వ‌స్తోంది.

రాను రాను ఒకానొక స‌మ‌యంలో దీని ధ‌ర కొన‌లేని స్థితిలోకి పైపైకి వెళుతుంద‌ని మార్కెట్ నిపుణులు అభిప్రాయ ప‌డ్డారు. ఇటీవ‌ల బంగారం, వెండి ధ‌ర‌లు స్థిమితంగా ఉండ‌డం లేదు. తాజాగా కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్ట‌డంతో అనూహ్యంగా మార్కెట్లు జోరందుకున్నాయి.

ఇదే ప్ర‌భావం ప‌సిడి ధ‌ర‌ను త‌గ్గించ‌గా వెండి పెరిగింది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధ‌ర 13 వంద‌ల‌కు త‌గ్గి 47 వేల 520 రూపాయ‌ల‌కు చేరుకుంది. గ‌త ట్రేడ్ లో 48 వేల వ‌ద్ద ముగిసింది. ఇదిలా ఉండ‌గా కేంద్ర ప్ర‌భుత్వం బ‌డ్జెట్ లో బంగారం, వెండి దిగుమ‌తుల‌పై దిగుమ‌తి సుంకాన్ని త‌గ్గించ‌డం కూడా మ‌రో కార‌ణమంటున్నారు మార్కెట్ వ‌ర్గాలు.

ఒక వైపు ప‌సిడి క‌ళ త‌ప్పినా వెండి మాత్రం జిగేల్ మంటోంది. కిలో వెండి ధ‌ర 3 వేల 400 పెరిగి 72 వేల 740కి చేరుకుంది. క్రితం సారి జ‌రిగిన ట్రేడింగ్ లో 69 వేల దాకా ప‌లికింది. ఇక ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్ లో ఔన్స్ బంగారం ధ‌ర 1870 అమెరిక‌న్ డాల‌ర్లు ఉండ‌గా వెండి కిలో ధ‌ర 29.80 డాల‌ర్లు ప‌ల‌క‌డం విశేషం.

No comment allowed please