Labh Singh Mother : పంజాబ్ ఎన్నికల్లో అసాధారణ విజయాలు నమోదయ్యాయి. ఒక రకంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకులు ఇంటి బాట పట్టారు. సామాన్యుల దెబ్బకు అసామాన్యులు సైతం ఓటమి పాలయ్యారు.
ఆప్ కోలుకోలేని దెబ్బకు ఠారెత్తి పోయారు. కానీ ఒకరు మాత్రం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు.
అతనే లభ్ సింగ్ ఉగోకే(Labh Singh Mother ). నిన్నటి దాకా లభ్ సింగ్ అంటే ఎవరో తెలియదు.
మామూలు ఆప్ కార్యకర్త. మొబైల్ షాప్ లో రిపేరర్ గా పని చేశాడు.
కానీ పంజాబ్ సీఎంగా ఉన్న చరణ్ జిత్ సింగ్ చన్నీని 37 వేల 550 ఓట్ల తేడాతో బదౌర్ నియోజకవర్గంలో పోటీ చేసి ఓడించాడు.
విచిత్రం ఏమిటంటే తాను ఎమ్మెల్యేగా గెలిచినా ప్రజల కోసం పని చేస్తానని తనకు హంగు, ఆర్భాటాలు అక్కర్లేదని చెప్పాడు లభ్ సింగ్(Labh Singh Mother ).
విచిత్రం ఏమిటంటే లభ్ సింగ్ తల్లి బల్దవ్ కౌర్ ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్ గా పని చేస్తోంది.
తన కొడుకు ఎమ్మెల్యే అయినా తాను మాత్రం తన జాబ్ ను వదులు కోనంటోంది ఈ సేవకురాలు.
తన కొడుకు గెలిస్తే మాత్రం తాను స్వీపర్ వృత్తి ఎందుకు మానేయాలని ప్రశ్నిస్తోంది. పని చేయడంలో ఉన్నంత తృప్తి ఇంట్లో కూర్చుంటే ఉండదని పేర్కొంటోంది ఈ సేవకురాలు.
నిన్నటి వరకు కూడా ఆమె సర్కారు బడిలో స్వీపర్ గా పని చేయడం పంజాబ్ రాష్ట్ర ప్రజలను ఒక్కసారిగా కదిలించేలా చేసింది. మా కుటుంబం నిన్నటి దాకా ఎంతో కష్టపడ్డాం. డబ్బుల కోసం నానా అగచాట్లు పడ్డాయి.
నా కొడుకు ఎమ్మెల్యే హోదాతో సంబంధం లేదు. నేను నా పాఠశాలలో నా విధులు నిర్వహిస్తానని కుండ బద్దలు కొట్టింది బల్దవ్ కౌర్. ప్రస్తుతం ఆమె హాట్ టాపిక్ గా మారారు.
ఎంత ఎత్తుకు ఎదిగినా తమ కుటుంబం మూలాలు మరిచి పోనంటోంది ఆ తల్లి. నిజంగా ఆమెను చూసి ఎంతో నేర్చు కోవాల్సి ఉంది.
ఈ తరానికి కౌర్ ఆదర్శం కూడా. సర్పంచ్ అయితేనే మిడిసి పడే వారున్న ప్రస్తుత తరుణంలో ఆమె ఎంచుకున్న మార్గం గొప్పది.
Also Read : పాటే ప్రాణమై లోకానికి దూరమై