Sanjay Raut : రైల్వే మంత్రి రాజీనామా చేయాల్సిందే
నిప్పులు చెరిగిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్
Sanjay Raut : ఘోరమైన రైలు ప్రమాదం జరిగినా ఇప్పటి వరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించారు శివసేన ఎంపీ , అధికార ప్రతినిధి సంజయ్ రౌత్(Sanjay Raut). దీనికి పూర్తిగా కేంద్రం బాధ్యత వహించాలని అన్నారు. ఇవాళ సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడారు. ఒడిశా ఘటనలో ఇప్పటి వరకు ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు, ఎంత మంది గాయపడ్డారనేది వివరాలు ప్రకటిచ లేదని ధ్వజమెత్తారు. ఇంతటి ఘోరం చోటు చేసుకున్నా పదవిని అడ్డం పెట్టుకుని వేలాడడం మంచి పద్దతి కాదన్నారు సంజయ్ రౌత్.
గతంలో రైలు ప్రమాదాలు జరిగిన సమయంలో వెంటనే తమ పదవులకు మాధవరావు సింధియా, లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారని గుర్తు చేశారు. కానీ అశ్వనీ వైష్ణవ్ మాత్రం దీనిపై స్పందించక పోవడం దారుణమన్నారు. రైల్వే కవాచ్ పై సంజయ్ రౌత్ కేంద్రంపై విరుచుకు పడ్డారు. ఒడిశా రైలు దుర్ఘటనకు మోదీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎంపీ డిమాండ్ చేశారు.
దేశీయంగా అభివృద్ది చేసిన యాంటీ కాల్టన్ సిస్టమ్ కవాచ్ గురించి కేంద్ర సర్కార్ అమలు చేయక పోవడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని ఆరోపించారు సంజయ్ రౌత్. ఇదిలా ఉండగా ఒడిశా లోని బాలా సోర్ లో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొన్న ఘటనలో భారీ ఎత్తున ప్రాణ నష్టం చోటు చేసుకుంది. 1,000 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటనపై సీబీఐతో విచారణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీతో సహా విపక్షాలు కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. లోపభూయిష్టమైన విధానాల వల్లనే ఈ ఘోరం చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే.
Also Read : Rehana Fathima : ధిక్కార స్వరం ఆమె ప్రస్థానం