MPs Suspended : ప్రతిపక్ష ఎంపీలపై స్పీకర్ వేటు
సెషన్ ముగిసేంత వరకు వర్తింపు
MPs Suspended : న్యూఢిల్లీ – లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తీవ్ర నిరసనల మధ్య 34 మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేశారు. హోం మంత్రి ప్రకటనను డిమాండ్ చేసినందుకు ఈ చర్యకు ఆదేశించినట్లు స్పష్టం చేశారు. ఈ చర్యలు లోక్ సభ సెషన్ ముగిసేంత వరకు కొనసాగుతుందని తెలిపారు స్పీకర్.
MPs Suspended on Lok Sabha
గత వారంలో కొందరు లోక్ సభ జరుగుతుండగానే దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా(Amit Shah) వివరణ ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు ప్రతిపక్ష ఎంపీలు.
విచిత్రం ఏమిటంటే దాడికి పాల్పడిన వారు కర్ణాటకకు చెందిన ఎంపీ ప్రతాప్ సింహ్ వెంట వచ్చారని పలువురు ఎంపీలు అభ్యంతరం తెలిపారు. దీనిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది కాకుండా ప్రివిలేజెస్ కమిటీ నేవదిక వచ్చే దాకా మరో ముగ్గురు ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్ ఓం బిర్లా. దీంతో ఇప్పటి వరకు 46 మంది ఎంపీలు వేటుకు గురయ్యారు.
అధిర్ రంజన్ చౌదరి, గౌరవ్ గొగోయ్ , కళ్యాణ్ బెనర్జీ, కకోలి ఘోష్ , సతాబ్ది రాయ్ , డీఎంకే సభ్యులు రాజా, దయానిధి మారన్ లు ఉన్నారు.
Also Read : RK Roja Selvamani : వచ్చే ఎన్నికల్లో పోటీ ఖాయం