MS Dhoni Entertainment : ధోనీ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్
ఎంఎస్డీ ఫ్యాన్స్ కు ఖుష్ కబర్
MS Dhoni Entertainment : భారతీయ క్రికెట్ దిగ్గజాలలో ఒకడిగా గుర్తింపు పొందాడు మహేంద్ర సింగ్ ధోనీ. ఆయన అత్యంత ధనవంతుల జాబితాలోకి చేరి పోయాడు. ఇప్పుడు కోహ్లీ, రోహిత్ తో పాటు ధోనీ వాల్యూ ఎంత ఉందనేది ఎవరికీ తెలియదు. ప్రస్తుతం జట్టులో లేక పోయినా తన మార్కెట్ , బ్రాండ్ విలువ మాత్రం ఏడాదికి కనీసం రూ. 1,000 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. మనోడు సంతకాలు చేసిన కంపెనీలు ఇప్పటికీ ఎన్ని ఉన్నాయనేది తెలియదు.
MS Dhoni Entertainment News
తాజాగా సినీ రంగంలోకి ఎంటర్ కావడం విస్తు పోయేలా చేసింది. ధోనీకి ప్రపంచ వ్యాప్తంగా లెక్కకు మించి అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ఇండియన్ ప్రిమీయర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. ఆ జట్టుకు ఆయనే రథ సారథి. ఒక రకంగా కింగ్ మేకర్ అని చెప్పక తప్పదు. సాధారణ ఆటగాళ్లతో తన టీమ్ ను ఛాంపియన్ గా తీర్చిదిద్దడంలో సక్సెస్ అయ్యాడు ధోనీ. ఈసారి ఫైనల్ లో గుజరాత్ టైటాన్స్ ను ఓడించి విజేతగా నిలిపాడు. వ్యక్తిగతంగా తాను రాణించ లేక పోయినా జట్టును మాత్రం సక్సెస్ ఫుల్ గా చేయడంలో కీలక పాత్ర పోషించాడు ధోనీ.
తాజాగా ధోనీ ఎంటర్ టైన్ మెంట్(MS Dhoni Entertainment) పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ. తన భార్య సాక్షి ధోనీ సినిమా ప్రపంచంలోకి అడుగు పెడుతున్నట్లు ధ్రువీకరించారు. లెట్స్ గెట్ మ్యారేజ్(Let’s Get Married) మూవీని నిర్మించాడు. దాని ప్రమోషన్ కూడా కొనసాగుతోంది.
Also Read : Shashi Tharoor : మోదీ మౌనం వీడక పోతే కష్టం