MS Dhoni Sanju Samson Viral : ధోనీ సంజూ శాంసన్ వైరల్
సోషల్ మీడియాలో హల్ చల్
MS Dhoni Sanju Samson Viral : అవును వాళ్లిద్దరూ మరోసారి హాట్ టాపిక్ గా మారారు. ఒకరు ఝార్ఖండ్ డైనమెట్ , మిస్టర్ కూల్ గా పేరు పొందిన మహేంద్ర సింగ్ ధోనీ. మరొకరు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆవేశ పడకుండా ప్రశాంతంగా నవ్వుతూ తన పని తాను చేసుకు పోయే కేరళ స్టార్ సంజూ శాంసన్(MS Dhoni Sanju Samson Viral). ఇద్దరూ ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) లో భాగంగా రాజస్థాన్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో తలపడ్డారు.
రాజస్థాన్ రాయల్స్ స్కిప్పర్ గా ఉన్న శాంసన్ , సీఎస్కే స్కిప్పర్ ఎంఎస్ ధోనీ మైదానంలోకి రాగానే స్టేడియం మొత్తం హోరెత్తి పోయింది. ఇద్దరూ ఉద్దండులే. మ్యాచ్ లో భాగంగా శాంసన్ టాస్ గెలిచాడు. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సందర్భంగా ఎంఎస్ ధోనీ, శాంసన్ పలకరించుకున్నారు. ఆ ఇద్దరిని కెమెరాలలో , ఫోన్లలో బంధించేందుకు అభిమానులు, ప్రేక్షకులు పోటీ పడ్డారు.
ఈ సందర్భంగా కేరళ స్టార్ సంజూ శాంసన్(Sanju Samson) మీడియాతో మాట్లాడాడు. తాము మైదానంలో ప్రత్యర్థులం మాత్రమేనని కానీ స్టేడియం వెలుపల ఇద్దరం మంచి మిత్రులమని స్పష్టం చేశాడు. ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ శాంసన్ ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటాడని, ఇది తనకు చాలా ఇష్టమని పేర్కొన్నాడు. మొత్తంగా మహేంద్ర సింగ్ ధోనీ, శాంసన్ లు వైరల్ గా మారారు. ఇప్పుడు నెట్టింట్లో వీరి ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి.
Also Read : మరోసారి టాప్ లోకి చేరిన రాజస్థాన్