Mumbai Indians Jersy WPL : సూర్యుడు..సముద్రం ఆదర్శం
ముంబై ఇండియన్స్ న్యూ జెర్సీ
Mumbai Indians Jersy WPL : ఏ జట్టు కైనా జెర్సీ అనేది ముఖ్యం. అదే ఆ జట్టును ప్రతిబింబించేలా చేస్తుంది. తమ జట్టుకు ఉన్న బలం ఏమిటో..సత్తా ఏపాటిదో చెప్పకనే చెబుతుంది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఆయా క్రీడా రంగాలకు సంబంధించి జెర్సీలు కీలక పాత్ర పోషిస్తాయి. జెర్సీ అంటే జట్టు మేనేజ్ మెంట్ , పేరు ప్రతిఫలిస్తుంది. అందుకే ఆయా యాజమాన్యాలు ఎక్కువగా జెర్సీల మీద ఫోకస్ పెడతాయి.
తాజాగా బీసీసీఐ ఆధ్వర్యంలో తొలి సారిగా ప్రత్యేకించి మహిళలకు సంబంధించిన ప్రీమీయర్ లీగ్ ను ప్రారంభించింది. శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తన జెర్సీని ఆవిష్కరించింది. కొత్త డిజైన్ తో ఆకట్టుకునేలా ఉంది. ఆ జట్టుకు స్టార్ క్రికెటర్ స్మృతీ మంధాన నాయకత్వం వహిస్తోంది.
ఇక రిలయన్స్ గ్రూప్ సంస్థకు చెందిన ముంబై ఇండియన్స్ ఉమెన్స్ టీంకు భారత మహిళా జట్టు స్కిప్పర్ ,పంజాబ్ కు చెందిన హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యం వహిస్తుండగా ఇటీవల జరిగిన వేలం పాటలో ఎంఐ చేజిక్కించుకుంది. తన జట్టుకు కౌర్ ను స్కిప్పర్ గా ఎంపిక చేసింది. రిచ్ లీగ్ లో మొత్తం 5 జట్లు పాల్గొననున్నాయి.
టోర్నీలో భాగంగా తాజాగా ముంబై ఇండియన్స్ తన టీంకు సంబంధించి కొత్త జెర్సీని(Mumbai Indians Jersy WPL) ఆవిష్కరించింది. దీనికి అందమైన క్యాప్షన్ కూడా జత చేసింది. హియర్స్ టు సన్ ..ది సీ అని పేర్కొంది. సూర్యుడు..సముద్రం..ఆదర్శం అని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ జెర్సీ వైరల్ అవుతోంది.
Also Read : మిథాలీ రాజ్ డ్యాన్స్ అదుర్స్