Rohit Sharma Jaiswal : జైశ్వాల్ ఇన్నింగ్స్ సూపర్ – రోహిత్
యంగ్ క్రికెటర్ కు మంచి భవిష్యత్తు
Rohit Sharma Jaiswal : ముంబై వేదికగా జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యశస్వి జైశ్వాల్(Yashasvi Jaiswal) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. కేవలం 62 బంతులు ఎదుర్కొని 16 ఫోర్లు 8 సిక్సర్లు కొట్టాడు. 124 పరుగులు చేశాడు. ఈసారి ఐపీఎల్ లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్. అంతకు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ సెంచరీ సాధిస్తే, కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ 104 రన్స్ చేశాడు. ఈ ఇద్దరి ఆటగాళ్ల కంటే ఎక్కువ పరుగులు చేశాడు.
ముందుగా టాస్ గెలిచిన శాంసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 20 ఓవర్లలో 212 పరుగులు చేసింది. ఇందులో జైశ్వాల్ ఒక్కడు చేసిన పరుగులే ఎక్కువ. అనంతరం 213 పరుగుల టార్గెట్ ను సునాయసంగా ఛేధించింది ముంబై ఇండియన్స్. ఇంకా 3 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యం పూర్తి చేసింది. గ్రీన్ 44 రన్స్ తో మెరిస్తే టిమ్ డేవిడ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 14 బంతులు మాత్రమే ఎదుర్కొని 45 రన్స్ తో హోరెత్తించాడు.
మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మీడియాతో మాట్లాడాడు. యశస్వి జైశ్వాల్ ను ఆకాశానికి ఎత్తేశాడు. ఈ యంగ్ క్రికెటర్ కు మంచి భవిష్యత్తు ఉందని, కళాత్మకమైన షాట్స్ తో అలరించాడని కొనియాడాడు.
Also Read : రాజస్థాన్ ఆశలపై నీళ్లు చల్లిన డేవిడ్