Nadendla Manohar : అగ్రీగోల్డ్ బాధితుల‌కు అంద‌ని న్యాయం

జ‌నసేన నేత మ‌నోహ‌ర్ ను క‌లిసిన బాధితులు

Nadendla Manohar : తెనాలి- రాష్ట్రంలో అగ్రి గోల్డ్ కంపెనీ బాధితుల ప‌రిస్థితి ఘోరంగా ఉంద‌ని ఆవేద‌న చెందారు బాధితులు. బాధితుల ఆవేద‌న‌ను ఏపీలో కొలువు తీరిన సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌ట్టించు కోవడం లేద‌ని వాపోయారు.

Nadendla Manohar Slams YS Jagan

ఈ మేర‌కు గురువారం జ‌న‌సేన పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు నాదెండ్ల మ‌నోహ‌ర్(Nadendla Manohar) ను పార్టీ రాష్ట్ర కార్యాలయంలో క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా అగ్రి గోల్డ్ క‌స్ట‌మ‌ర్స్ , ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేష‌ణ్ గౌర‌వ అధ్య‌క్షులు ముప్పాళ్ల నాగేశ్వ‌ర్ రావు జ‌న‌సేన పార్టీ పీఏసీ చైర్మ‌న్ నాదెండ్ల‌ను క‌లుసుకుని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇదిలా ఉండ‌గా అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో సంయుక్తంగా సెప్టెంబర్ 15 వ తేదీన విజయవాడలో ర్యాలీ నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా జ‌న సేన పార్టీ మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని నాదెండ్ల మ‌నోహ‌ర్ ను విన్న‌వించారు.

బాధితుల‌కు న్యాయం చేసేందుకు జ‌న‌సేన పార్టీ ప్ర‌య‌త్నం చేస్తుంద‌న్నారు . ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రికీ న్యాయం చేసేంత వ‌ర‌కు తాము నిద్ర‌పోమ‌న్నారు మ‌నోహ‌ర్. రాష్ట్ర స‌ర్కార్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించు కోవ‌డం లేద‌ని ఆరోపించారు. బాధితుల‌కు మ‌ద్ద‌తు ఇస్తామ‌ని స్ప‌ష్టం చేశారు పీఏసీ చైర్మ‌న్.

Also Read : Patnam Mahender Reddy : కేటీఆర్ తో ప‌ట్నం భేటీ

Leave A Reply

Your Email Id will not be published!