Nagam Janardhan Reddy : బీఆర్ఎస్ గూటికి నాగం
కేసీఆర్ తో మర్యాదక భేటీ
Nagam Janardhan Reddy : హైదరాబాద్ – తెలంగాణలో కీలకమైన నాయకుడిగా పేరు పొందిన డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి మర్యాద పూర్వకంగా సీఎం కేసీఆర్ ను కలుసుకున్నారు. అంతకు ముందు ఆయనను తన నివాసంలో ఐటీ, ఆరోగ్య శాఖ మంత్రులు కేటీఆర్, తన్నీరు హరీశ్ రావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అపారమైన రాజకీయ అనుభవం కలిగిన మీరు తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. దీనిపై తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశమై ఆలోచించి చెబుతానని హామీ ఇచ్చారు.
Nagam Janardhan Reddy Joined in BRS
ఆ వెంటనే సీఎంతో కలవడం విస్తు పోయేలా చేసింది. పార్టీలోకి సాదర స్వాగతం పలుకుతున్నానని కేసీఆర్ పేర్కొన్నారు. గతంలో వీరిద్దరూ తెలుగుదేశం పార్టీలో కీలకమైన నేతలుగా ఎదిగారు. నాగం జనార్దన్ రెడ్డి(Nagam Janardhan Reddy) చంద్రబాబు తర్వాత నెంబర్ 2గా ఉన్నారు. ఆరోగ్య, పౌర సరఫరాల శాఖ మంత్రిగా పని చేశారు. ఇదే సమయంలో కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ గా పని చేశారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కొత్త పార్టీని స్థాపించారు. కీలక పాత్ర పోషించారు. బీఆర్ఎస్ సర్కార్ అవినీతి, అక్రమాలను ఎండగట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాగర్ కర్నూల్ నుంచి టికెట్ ను ఆశించారు. కానీ ఊహించని రీతిలో మాజీ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డికి కేటాయించింది సీటు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నాగం. ఆ వెంటనే బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. నాగం చేరికతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో బలమైన సామాజిక వర్గం పార్టీకి చేకూరనుంది.
Also Read : CM KCR : కేసీఆర్ జోష్యం గులాబీదే విజయం